Car-ramming Attack | జర్మనీలో కార్ ర్యామింగ్ దాడి.. భారతీయులకు గాయాలు
Car-ramming Attack : జర్మనీలోని మాగ్డెబర్గ్ నగరంలో కార్ ర్యామింగ్ దాడిలో ఐదుగురు మృతి చెందారు. 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఏడుగురు భారతీయులు ఉన్నారు. ఈ మేరకు నిన్న రాత్రి బెర్లిన్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. శుక్రవారం సాయంత్రం సాక్సనీ-అనహాల్ట్ రాష్ట్రంలోని మాగ్డెబర్గ్ నగరం (Eastern German city of Magdeburg)లో 50 సంవత్సరాల వయసున్న వ్యక్తి తన కారును క్రిస్మస్ మార్కెట్ (Christmas market)లో జనసందోహంపై నడిపాడు. దీంతో ఐదుగురు మృతి చెందారని, వీరిలో తొమ్మిది సంవత్సరాల బాలుడు కూడా ఉన్నాడని, 200 మందికి పైగా గాయపడ్డారని జర్మన్ అధికారులు పేర్కొన్నారు.
భారతీయులకు సీరియస్
కార్ ర్యామింగ్ దాడిలో ఏడుగురు భారతీయులు గాయపడగా వారిని ఆస్పత్రిలో చేర్చారు. వీరిలో ముగ్గురు డిశ్చార్జ్ కాగా మరో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటనను భ...




