Sarkar Live

Crime

Telangana News | ఏడవ తరగతి విద్యార్థి ఆత్మహత్య
Crime

Telangana News | ఏడవ తరగతి విద్యార్థి ఆత్మహత్య

Telangana News | తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. చక్కగా చదువుకొని నేర్చుకొని గొప్పవాడు కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలు ఆవిరైపోతున్నాయి. స్కూళ్లు, హాస్టళ్లలోని ఉపాధ్యాయుల తీవ్రమైన ఒత్తిడితోనే ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్య కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ రోజు ఉదయం కూడా ఓ విద్యార్థి ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.వివరాల్లోకెళితే.. హైదరాబాద్ హయత్ నగర్ లో ఉన్న నారాయణ స్కూల్లో 7 వ తరగతి చదువుతున్న లోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. వనపర్తి జిల్లాకు చెందిన లోహిత్ ను చదువు కోసం తల్లిదండ్రులు ఆ స్కూల్ లో చేర్పిస్తే సదరు విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు షాక్ గురయ్యారు. పాఠశాలలోని టీచర్ వల్లే తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. లోహిత్ మృతి చెందిన విషయం తె...
RG Kar case | మళ్లీ మొదటికొచ్చిన ఆర్‌జి క‌ర్‌  ఆస్పత్రి కేసు..
Crime

RG Kar case | మళ్లీ మొదటికొచ్చిన ఆర్‌జి క‌ర్‌ ఆస్పత్రి కేసు..

RG Kar case updates : కోల్‌క‌తాలోని RG కర్ మెడికల్ కాలేజ్ అండ్‌ హాస్పిటల్‌లో వైద్యురాలి హ‌త్యాచారం ఘ‌ట‌న‌పై నిర‌స‌న‌లు ఉధృత‌మయ్యాయి. ప‌శ్చిమ బెంగాల్ సంయుక్త వైద్యుల వేదిక (WBJPD) దీక్ష‌ల‌కు పూనుకుంటోంది. డిసెంబర్ 19 నుంచి కోల్‌కతా నడిబొడ్డున నిరసన దీక్ష ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. లేడీ డాక్ట‌ర్‌ హ‌త్యాచారం కేసులో ప్రధాన నిందితులకు బెయిల్ మంజూరు చేయడంపై WBJPD మండిప‌డుతోంది. ఈ ఘ‌ట‌న‌పై 90 రోజుల లోపు చార్జ్‌షీట్ సమర్పించడంలో సీబీఐ విఫలం కావ‌డం వ‌ల్లే నిందితులు బెయిల్ పొంద‌గ‌లిగార‌ని ఆరోపిస్తోంది. సీబీఐ చార్జ్‌షీట్‌లో జాప్యం వైద్యురాలిని అత్యాచారం చేసి హ‌త్య చేయ‌డంపై ఐదు వైద్యుల సంఘాల సమాఖ్య WBJPD డిసెంబరు 26 వరకు కోల్‌కతాలోని డోరీనా క్రాసింగ్ వద్ద ఈ నిరసనను చేపట్టాలని నిర్ణయించింది. ఈ ఘ‌ట‌న‌పై సీబీఐ ద‌ర్యాప్తును వేగ‌వంతం చేయాల‌ని, కేసులో అదనపు చార్జ్‌షీట్ వెంటనే సమర్పించాలని డిమాండ్...
COVID-19 Scam | కొవిడ్ ప‌రిక‌రాల స్కాం కేసులో సంచలన విషయాలు..
Crime

COVID-19 Scam | కొవిడ్ ప‌రిక‌రాల స్కాం కేసులో సంచలన విషయాలు..

COVID-19 Scam Case : కర్ణాటకలో కరోనా మహమ్మారి సమయంలో వైద్య పరికరాల కొనుగోలులో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై పోలీసులు తొలి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పాలనలో ఇది చోటుచేసుకుందని ఫిర్యాదు అంద‌డంతో ఈ మేర‌కు కేసు న‌మోదైంది. రూ. 167 కోట్ల కుంభ‌కోణం కోరానా మహమ్మారి సమయంలో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (PPE) కిట్లు, N-95 మాస్కుల కొనుగోలులో అవకతవకలు జ‌రిగాయ‌ని, దీంతో ప్ర‌భుత్వ ఖ‌జానాకు రూ. 167 కోట్ల నష్టం వాటిల్లిందని కర్ణాటక వైద్య విద్యా డైరెక్టరేట్ (DME) కు చెందిన ఎం. విష్ణు ప్రసాద్ చేసిన ఫిర్యాదు చేశారు. ఈ కుంభ‌కోణంలో పూర్వ DME డైరెక్టర్ పి.జి. గిరీష్, ఆఫీసర్లు జి.పి.రఘు, ఎన్. మునిరాజు ప్ర‌మేయం ఉంద‌ని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో డిసెంబ‌రు 14న వారిపై ఎఫ్‌ఐఆర్ న‌మోదైంది. అయితే.. ఈ ఎఫ్‌ఐఆర్‌లో ఏ రాకీయ నాయ‌కుడిని కూడా నిందితుడిగా పేర్కొన‌లేదు.ఈ వార్త‌...
Ganja | ఇంటి పెరట్లో గంజాయి.. అరెస్టు చేసిన పోలీసులు
Crime

Ganja | ఇంటి పెరట్లో గంజాయి.. అరెస్టు చేసిన పోలీసులు

Hanamkonda | సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఓ వ్యక్తి ఏకంగా తన ఇంటి పెరట్లోనే గంజాయి మొక్కలను (Ganja Plants) పెంచాడు తన ఇంటి పెరట్లో గంజాయి మొక్కల పెంపకం చేపట్టిన సదరు వ్యక్తిని యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళితే.. హ‌న్మ‌కొండ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాయంపేట ప్రాంతంలో నివాసం ఉండే అట్ల వెంకట నర్సయ్య (72), వ్యవసాయ కూలీగా పనిచేస్తూనే మరింత సులభంగా డబ్బు సంపాదించాలని ఓ ఐడియా వేసుకున్నాడు. ఇందుకోసం వెంకటనర్సయ్య తన ఇంటి పెరట్లో ఐదు అడుగుల విస్తీర్ణంలో గంజాయి మొక్కల పెంపకం చేపట్టి వాటిలో కొన్ని మొక్కలను ఎండబెట్టి విక్రయించేందుకు సిద్దమ‌య్యాడు. అయితే.. యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీం కు సమాచారం రావడంతో ఇన్‌స్పెక్టర్ సురేష్, ఆర్ఐ శివకేశవులు గంజాయి పెంచుతున్న ఇంటిలో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ బృందంతో తనిఖీలు చేపట్టగా ఇంటి పెరట్లో గంజాయి మొక్కను గుర...
Atul Subhash suicide case | అతుల్ ఆత్మ‌హ‌త్య కేసులో బిగ్ అప్డేట్
Crime

Atul Subhash suicide case | అతుల్ ఆత్మ‌హ‌త్య కేసులో బిగ్ అప్డేట్

Atul Subhash suicide case : గృహ హింస‌కు గురై ఆత్మ‌హ‌త్య చేసుకున్న అతుల్ సుభాష్ (34) కేసు అనేక మ‌లుపులు తిరుగుతోంది. అత‌డి అత్త నిషా సంఘానియా, బావ‌మ‌రిది అనురాగ్ సంఘానియాను క‌ర్ణాట‌క పోలీసులు శ‌క్ర‌వారం అరెస్టు చేశారు. అతుల్ భార్య ప‌రారీలో ఉంద‌ని పోలీసులు తెలిపారు. వేధింపులు త‌ట్టుకోలేక‌... అతుల్ ఆత్మ‌హ‌త్య ప్ర‌పంచ‌మంతా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వివాహిత పురుషులు కూడా గృహ హింస‌కు గురువుతున్నార‌నే విష‌యాన్ని ఎత్తి చూపింది. త‌న భార్య, ఆమె కుటుంబం త‌న‌ను డ‌బ్బుల కోసం వేధిస్తున్నార‌ని, రూ. 3 కోట్లు డిమాండ్ చేస్తూ మానసిక క్షోభ‌కు గురి చేస్తున్నార‌ని అతుల్ సుభాష్ డిసెంబ‌ర్ 9న ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. దీనికి ముందు 40 పేజీల సుదీర్ఘ సూసైడ్ నోట్ రాశాడు. దీంతోపాటు 90 నిమిషాల వీడియా ద్వారా త‌న భార్య నిఖిత సింఘానియా, ఆమె కుటుంబం త‌న‌ను ఎలా వేధించారో వివ‌రించాడు. నా అస్తిక‌లు కాలువ‌లో క‌ల‌పండి అతుల్ తన సూసై...
error: Content is protected !!