Lagacharla | లగచర్ల గిరిజన రైతుకు సంకేళ్లు వేసి తీసుకొచ్చిన జైలు సిబ్బంది ..
ఫార్మాసిటీపై ఆందోళన చేపట్టిన గిరిజన రైతులపై కేసు నమోదు చేసిన పోలీసులు మరోసారి వారిని అవమానించేలా దారుణానికి పాల్పడ్డారు. అధికారులపై దాడులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో లగచర్ల (Lagacharla) కు చెందిన రైతు హీర్యానాయక్‌తో పాటు మరికొందరు రైతులను అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే..
కాగా హీర్యానాయక్‌కు గురువారం గుండె సమస్య తలెత్తడంతో అతడికి సంకెళ్ళ తోనే (Hand Cuffs) జైలు సిబ్బంది సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లి 2డీ ఈకో టెస్ట్ చేయించారు. సంకెళ్లు వేసి తీసుకురావడం సరికాదని గతంలో న్యాయాస్థానాలు హెచ్చరించినా కూడా పోలీసులు పట్టించుకోకుండా హీర్యానాయక్‌కు సంకెళ్లు వేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. . కాగా ఆసుపత్రిలో హీర్యా నాయక్ ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పరామర్శించారు.
సీఎం రేవంత్ పై కేటీఆర్ ఆగ్రహం
ఇదిలా ఉండగా లగచర్ల గిరిజన రైతులకు (Lagachar...




