సంక్షోభంలో ‘అన్నపూర్ణ’ వెన్నెముక–రైస్ మిల్లర్ల ఆవేదన!
తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే రైస్ మిల్లింగ్ పరిశ్రమ నేడు కుప్పకూలే స్థితికి చేరుకుంది. అన్నదాత పండించిన ప్రతి గింజను బియ్యంగా మార్చి కోట్లాది మంది ఆకలి తీర్చే ఈ పరిశ్రమ, ఇప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అశాస్త్రీయ నిబంధనలకు బలైపోతోంది. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఈ రంగాన్ని '25 శాతం పెనాల్టీ' భూతం వెంటాడుతోంది.
నిలువునా ముంచుతున్న పెనాల్టీలు: ఇది జరిమానా కాదు.. మరణశాసనం!
ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక లోపాలు లేదా ఎఫ్.సి.ఐ (FCI) వద్ద జరిగే జాప్యం వల్ల సీఎంఆర్ (CMR) డెలివరీలో స్వల్ప జాప్యం జరిగితే, ప్రభుత్వం విధిస్తున్న 25 శాతం భారీ పెనాల్టీ మిల్లర్ల పాలిట ఉరితాడుగా మారుతోంది. 2014 నుండి పేరుకుపోయిన కోట్ల రూపాయల బకాయిలు ఒకవైపు, పెరిగిన బ్యాంకు వడ్డీలు మరోవైపు మిల్లర్లను ఆత్మహత్యల దిశగా నెడుతున్నాయి. ప్రభుత్వం నుండి మాకు రావాల్సిన బకాయిలు చె...

