Fast Track Immigration : హైదరాబాద్ విమానాశ్రయంలో ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్
Fast Track Immigration : హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ - ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ (FTI-TTP) ప్రారంభమైంది. భారతీయ పాస్‌పోర్టుదారులు, ఓసీఐ (ఓవర్సిస్ సిటీజన్స్ ఆఫ్ ఇండియా) కార్డుదారులకు మరింత వేగవంత, సులభతర ఇమ్మిగ్రేషన్ సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవస్థ (Fast Track Immigration – Trusted Traveller Programme)ను అందుబాటులోకి తెచ్చింది. తద్వారా ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఎక్కువ సేపు వేచి చూడకుండా సులభంగా ఇమ్మిగ్రేషన్ పొంది సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ఇమ్మిగ్రేషన్ కోసం ప్రయాణికులు ఆన్‌లైన్‌లో ముందుగానే దరఖాస్తు చేసుకొని ధ్రువీకరణ పొందాక నేరుగా ఎయిర్‌పోర్టుకు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా వెంటనే క్లియరెన్స్ పొందొచ్చు. కౌంటర్ల వద్ద ఎక్కువ సమయాన్ని వెచ్ఛించాల్సిన అవసరం ఇక ఉండదు.
FTI-TTP సేవలు ఎలా ప...