DTC Hanmakonda | పుప్పాల. పర్యవేక్షణ ఎక్కడా…?
ప్రమాదాలకు పరోక్షంగా కారణం అవుతూనే..రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్న ఆర్టీఏ అధికారులు ?
ఉప రవాణా కమిషనర్ పరిధిలోని అన్ని కార్యాలయాల్లో టెస్ట్ ట్రాక్ లు లేకుండానే విచ్చలవిడిగా లైసెన్సులు జారీ?
వాహనదారులు కంప్యూటర్ పరీక్ష పాస్ అవుతున్నారా? పాస్ చేస్తున్నారా?
లైసెన్స్ లు ఎలా జారీ చేస్తున్నారో సిసి కెమెరాల్లో కనిపించడంలేదా?
DTC Hanmakonda : రోడ్డు ప్రమాదాల పట్ల వాహనదారులకు అవగాహన కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గదే, ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే.. కానీ అసలు రోడ్డు ప్రమాదాలకు కారకులు ఎవరు? మామూళ్ల మత్తులో విచ్చలవిడిగా తమ ఇష్టారాజ్యంగా లైసెన్స్ లు (Driving License) జారీచేస్తున్న ఆర్టీఏ(RTA) లోని కొందరు అధికారులు కాదా? రోడ్డు ప్రమాదాలకు (Road Accidents)పరోక్షంగా కారణమవుతున్నవారే రోడ్డు భద్రతా మాసోత్సవాలు (National Road Safety Month) నిర్వహించడం చూస...




