Govt Teacher | బిల్డర్ అవతారమెత్తిన ప్రభుత్వ టీచర్..
ప్రభుత్వ విధులు నిర్వహిస్తూనే బిల్డర్ గా రాణిస్తున్న ఉపాధ్యాయుడు
ఇండ్లు కట్టిస్తాడు... టీచర్లకే అమ్ముతాడు
పాఠాలు చెప్పడంకంటే ఇండ్లు కట్టించి అమ్మడంపైనే సారు దృష్టి
అండగా మరో నలుగురు ఉపాధ్యాయులు..?
Govt Teacher as a Builder | పాఠాలు చెప్పాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడట. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పడం అటుంచితే తోటి టీచర్ లకు రియల్ ఎస్టేట్ రంగంలో ఎలా రాణించాలో నేర్పిస్తున్నాడట. ఆ ఉపాధ్యాయుడికి పాఠాలు చెప్పడంకంటే కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమంటేనే ఎక్కువ ఇష్టమట. గత కొన్నిసంవత్సరాలుగా రియల్ రంగంలో రాణిస్తున్న సదరు ఉపాధ్యాయుడు అంచెలంచెలుగా ఎదిగి బిల్డర్ గా అవతరించినట్లు విద్యాశాఖలో జోరుగా చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ చేస్తూ ప్రభుత్వ టీచర్ లకే ప్లాట్లు అమ్ముతూ కోట్లకు పడగలెత్తిన్నట్లు ట...



