Sarkar Live

Hyderabad

Rain Alert | తెలంగాణలో 4 రోజులు వానలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
State, Hyderabad

Rain Alert | తెలంగాణలో 4 రోజులు వానలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

Rain Alert | తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. సోమవారం మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. మంగళవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని చెప్పింది. కాగా గత 24గంటల్లో ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, వరంగల్‌, కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మంలో పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా త...
Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు
State, Hyderabad

Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case ) సంచలనం సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే రాజకీయ నాయకులు, ముఖ్య పార్టీల నేతలు, అనుచరుల ఫోన్ సంభాషణలను ట్యాప్ చేసినట్టు తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ (SIT Investigation) చేస్తుండగా తాజా సమాచారం ప్రకారం 4200 మందికి పైగా వ్యక్తుల ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు వెల్లడైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొన్ని పార్టీలు, వ్యక్తులు ఎన్నికల పక్రియను ప్రభావితం చేస్తున్నారన్న నెపంతో, పలువురు కీలక రాజకీయ నాయకుల ఫోన్‌లు ట్యాప్‌ ‌చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ కేసులో 4,200 మందికి పైగా వ్యక్తుల ఫోన్లు ట్యాప్‌ ‌చేసినట్లు ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ‌ప్రభాకర్‌ ‌రావు (Prabhakar Rao) పై ఆరోపణలు వచ్చాయి. 2023 నవంబర్‌ 15 ‌నుంచి 30వ తేదీ మధ్యలోనే కనీసం 618 మంది నేతల ఫోన్లను ట్యాప్‌ ‌చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుల...
భారీగా IAS అధికారుల బదిలీలు |  జాబితా ఇదే.. IAS transfers
State, Hyderabad

భారీగా IAS అధికారుల బదిలీలు | జాబితా ఇదే.. IAS transfers

IAS transfers in Telangana 2025 | రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 36 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఎన్‌.శ్రీధర్‌ను నియమించింది. గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్‌ శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేశ్‌ కుమార్‌ను బదిలీ చేసింది. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్‌ మిట్టల్‌, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాశ్‌, దిల్లీలో తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా శశాంక్‌ గోయల్‌ను బదిలీ చేసింది. హైదరాబాద్‌ కలెక్టర్‌గా దాస‌రి హరిచందన, టీజీ ఆయిల్‌ ఫెడ్‌ ఎండీగా శంకరయ్య, రిజిస్ట్రేషన్స్‌ అండ్స్‌ స్టాంప్స్‌ స్పెషల్‌ సెక్రెటరీగా రాజీవ్‌ గాంధీ హనుమంతును నియమించింది. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర...
Telangana Cabinet | కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు
State, Hyderabad

Telangana Cabinet | కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు

Telangana Cabinet 2025 | తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖలు ( Portfolio Allocation)కేటాయించారు. కార్మిక, మైనింగ్‌ శాఖ మంత్రిగా గ‌డ్డం వివేక్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రిగా అడ్లూరు లక్ష్మణ్, క్రీడలు, యువజన సర్వీసులు, పశుసంవర్థకశాఖ మంత్రిగా వాకిటి శ్రీహరి బాధ్యతలు నిర్వ‌ర్తించ‌నున్నారు. వీరు గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు సెక్రటేరియట్ చాంబర్లు సైతం ఇప్పటికే సిద్ధమ‌య్యాయి. వాకిటి శ్రీహరి : పశుసంవర్థక, స్పోర్ట్‌ అండ్‌ యువజన సర్వీసులు శాఖ గడ్డం వివేక్‌: కార్మిక, మైనింగ్‌ శాఖలు అడ్లూరి లక్ష్మణ్‌ : ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ ఇక కొత్తగా మంత్రివ‌ర్గంలోకి వచ్చిన ఈ ముగ్గురు మొద‌టిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచినవారే.. వివేక్ గతంలో ఎంపీగా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక మక్తల్ నుంచి వాకిిటి శ్రీహరి, ధర్మపురి ...
తొలిరోజే ఎగ్ బిర్యానీతో చిన్నారులకు స్వాగతం  – Anganwadi Egg Biryani
State, Hyderabad

తొలిరోజే ఎగ్ బిర్యానీతో చిన్నారులకు స్వాగతం – Anganwadi Egg Biryani

Anganwadi Egg Biryani | వేసవి సెలవుల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలు (Anganwadi centers ) తిరిగి తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా ‘అమ్మ మాట అంగన్వాడీ బాట’ అనే థీమ్‌తో నిర్వహించిన ర్యాలీల్లో చిన్నారులకు స్వాగతం పలికారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) ఆదేశాల మేరకు మొదటిరోజు చిన్నారులకు ప్రత్యేకంగా ‘ఎగ్ బిర్యానీ (Egg Biryani in Anganwadi centers)’ ని మ‌ధ్యాహ్న భోజ‌నంలో వడ్డించారు. పిల్లలు ఎగ్ బిర్యానీను ఎంతో ఉత్సాహంగా ఇష్టంగా ఆస్వాదించారు. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా అంగన్వాడి కేంద్రాల్లో వెరైటీ ఫుడ్‌గా ఎగ్ బిర్యానీ వడ్డించడం విశేషం. Egg Biryani : అంగన్ వాడీల్లో వెరైటీ ఫుడ్ ప్రతి రోజు ఒకే రకమైన భోజనం కాకుండా చిన్నారుల అభిరుచులకు తగినట్లుగా ఆహారంలో మార్పులు తీసుకురావాలని తెలంగాణ సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే.. చిన్నారులకు వెరైటీ ఫుడ్ అం...
error: Content is protected !!