TGSRTC : ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్..
TGSRTC | హైదరాబాద్ నగర ప్రజలకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజల సౌకర్యార్థం ఒక వినూత్నమైన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘మెట్రో కాంబి టికెట్’ (metro combi ticket) ను కేవలం రూ.20 కే ప్రవేశపెడుుతున్నట్లు వెల్లడించింది. దీని ద్వారా జనరల్ బస్ టికెట్ (GBT) మెట్రో ఎక్స్‌ప్రెస్ , సాధారణ నెలవారీ బస్ పాస్ ఉన్నవారు (Bus pass holders) హైదరాబాద్ అంతటా మెట్రో డీలక్స్ బస్సుల్లో (Metro deluxe buses) ప్రయాణించొచ్చు.
ఇప్పటికే ఉన్న నెలవారీ పాస్ హోల్డర్లకు అప్‌గ్రేడ్ చేసిన ప్రయాణ ఎంపికను అందిస్తుంది. నామమాత్రపు అదనపు ఖర్చుతో వారు ఎక్కువ సౌకర్యాన్ని ఆస్వాదించడానికి ఈ ఆఫ ఉపయోపడుతుంది. హైదరాబాద్‌లోని అన్ని మెట్రో డీలక్స్ సేవలలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.
ఆర్టీసీలో సమ్మె గుబులు
ఇదిలా ఉండగా, ఆర్టీసీ (TGSRTC) కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఆర్టీ...




