Revanth Reddy meets PM Modi | హైదరాబాద్ మెట్రో విస్తరణకు సహకరించండి..!
Revanth Reddy meets PM Modi : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి (Chief Minister A Revanth Reddy) దేశ రాజధాని ఢిల్లీకి బుధవారం బయల్దేరారు. ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేంద్ర సహాయాన్ని కోరారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి (Andhra Pradesh Reorganisation Act) సంబంధించిన పెండింగ్ సమస్యల గురించి వివరించారు. ఈ భేటీలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
Revanth Reddy meets PM Modi : టన్నెల్ ప్రమాదంపై చర్చ
ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద జరిగిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం గురించి కూడా ముఖ్యమంత్రి ప్రధానికి సీఎం రేవంత్ వివరించారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయిన ఘటనపై కేంద్ర సహాయాన్ని కోరారు. కార్మికులను కాపాడేందుక...




