TTD : తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల జారీ.. ఆన్‌లైన్‌లో బుకింగ్
TTD Special Entry Darshan : తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) భక్తులకు శుభవార్త చెప్పింది. మే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం (Special Entry Darshan) ఆన్‌లైన్ టికెట్లను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఇవి ఈ రోజు (ఫిబ్రవరి 24) ఉదయం 10 గంటల నుంచి అందుబాటులోకి వచ్చాయి. భక్తులు ముందస్తుగా బుక్ చేసుకోవడం వల్ల ఈ టికెట్లు జారీ అవుతున్నాయి. అంతేకాదు.. మార్చి నెలకు సంబంధించిన పద్మావతి అమ్మవారి తిరుచానూరు ప్రత్యేక దర్శనం టికెట్లు కూడా విడుదల చేస్తున్నట్లు దేవస్థానం వెల్లడించింది. భక్తులు వీటిని కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని పేర్కొంది.
TTD Special Entry Darshan : వసతి కేటాయింపు
తిరుమల, తిరుపతిలో భక్తుల వసతి కోసం మే నెలకు సంబంధించిన వసతి కేటాయింపు ఈ రోజు (ఫిబ్రవరి 24న ) మధ్యాహ్నం నుంచి అందుబాటులోకి వచ్చింది. భక్తులు TTD అధికారిక వెబ్‌సైట్ (www.ttdse...




