Srisailam Canal roof collapsed | శ్రీశైలం కెనాల్ టన్నెల్‌లో ఘోర ప్రమాదం.. శిథిలాల కింద కార్మికులు!
Srisailam Canal roof collapsed : తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం డొమలపెంట సమీపంలో నిర్మాణంలో ఉన్న శ్రీశైలం ఎడమ కాలువ (Srisailam Left Bank Canal-SLBC) టన్నెల్‌లో ఈ రోజు ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టన్నెల్ పైభాగం మూడు మీటర్ల మేర కూలిపోవడంతో సుమారు ఆరుగురు కార్మికులు ఆ శిథిలాల మధ్య చిక్కుకున్నారని తెలుస్తోంది.
నాలుగు రోజుల క్రితం ప్రారంభమైన Srisailam Canal roof పనులు
ఈ ప్రమాదం ఎడమ కాలువ టన్నెల్ 14వ కిలోమీటరులో జరిగింది. చాలా రోజుల విరామం తర్వాత నాలుగు రోజుల క్రితమే ఇక్కడ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. దీంతో అనేక మంది కార్మికులు పనులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. కొంత మంది కార్మికులు స్వల్ప గాయాలతో బయటపడగా ఆరుగురు టెన్నల్ శిథిలాల మధ్య చిక్కున్నారని తెలుస్తోంది. గాయపడిన కార్మికులను ప్రాజెక్ట్ సైట్ మేనేజ్‌మెంట్ బృందం సమీపంలోని ఆస్పత్రికి తరలించింది. మ...




