Sarkar Live

State

TGSRTC | ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్‌ టు విజయవాడ వెళ్లే వారికి 10శాతం డిస్కౌంట్‌
State

TGSRTC | ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్‌ టు విజయవాడ వెళ్లే వారికి 10శాతం డిస్కౌంట్‌

TGSRTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ ఆర్టీసీ) విజయవాడ రూట్‌లో ప్రయాణించే వారికి శుభ‌వార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడ (Hyderabad To Vijayawada ) మార్గంలో ప్రత్యేక రాయితీలను ప్రకటిస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్ర‌క‌టించింది. లగ్జరీ, నాన్‌ ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌, సూపర్‌ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం రాయితీ వ‌ర్తించ‌నుంది. అలాగే రాజధాని ఏసీ బస్సుల్లో 8 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు టీజీఆర్టీసీ వెల్ల‌డించింది. ఈ మేరకు బుధవారం ఆర్టీసీ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రాయితీతో కల్పించే డిస్కౌంట్‌ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరింది. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ కోసం అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలని ప్ర‌యాణికుల‌కు సూచించింది. ఈ విషయాన్ని టీజీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్ ఓ ఒక పోస్టు చేశారు. విజయవాడ రూట్...
Secunderabad station | సికింద్రాబాద్ స్టేష‌న్‌కు వెళ్తున్నారా.. ఇది పాటించండి
State

Secunderabad station | సికింద్రాబాద్ స్టేష‌న్‌కు వెళ్తున్నారా.. ఇది పాటించండి

Secunderabad Railway station : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆధునికీక‌ర‌ణ ప‌నులు సాగుతున్నాయి. ప్ర‌యాణికుల‌కు స‌రికొత్త హంగుల‌తో మ‌రిన్ని సౌక‌ర్యాల‌ను పెంచేందుకు పున‌ర్నిర్మాణం సాగుతోంది. ఈ ప‌నుల నేప‌థ్యంలో ప్ర‌యాణికుల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా రైల్వే శాఖ (South Central Railway-SCR) ప‌లు చ‌ర్య‌లు చేప‌డుతోంది. ముఖ్యంగా ప్ర‌యాణికులు స్టేష‌న్ (Secunderabad station) లోప‌లికి వెళ్లడానికి, బ‌య‌ట‌కు రావ‌డానికి ఉన్న మార్గాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. Secunderabad station | కొత్త మార్గాలు ఇవే.. ఫ్లాట్‌ఫామ్‌ నంబర్‌ 1: గణేష్‌ ఆలయం పక్కన గేట్‌ నంబర్‌ 2 వద్ద కొత్త ప్రవేశ ద్వారం ఏర్పాటు చేశారు. ఇది ప్రయాణికులు స్టేషన్‌లోకి సులభంగా ప్రవేశించేందుకు సహాయపడుతుంది. గేట్‌ నంబర్‌ 4: ఈ గేటును మూసివేశారు. స్వాతి హోటల్‌ ఎదురుగా గేటు నంబర్ 3తోపాటు 3బీ అనే అదనపు ప్రవేశద్వారాలను ఏర్పాటు చేశారు. ఇవి ప్రయ...
Tea stall shut down | కేటీఆర్ పేరుతో టీస్టాల్‌.. మూసివేయించిన క‌లెక్ట‌ర్‌
State

Tea stall shut down | కేటీఆర్ పేరుతో టీస్టాల్‌.. మూసివేయించిన క‌లెక్ట‌ర్‌

Tea stall shut down : సిరిసిల్ల రాజ‌న్న జిల్లాలో చోటుచేసుకున్న ఓ సం ఘ‌ట‌న తీవ్ర చ‌ర్చనీయాంశమైంది. కేటీఆర్ పేరు(KTR Tea Stall)తో ఉన్న ఓ టీస్టాల్‌ను క‌లెక్ట‌ర్ మూసి వేయించ‌డం హాట్ టాపిక్‌గా మారింది. ట్రేడ్ లైసెన్స్ లేక‌పోవ‌డం వ‌ల్లే ఈ చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని అధికారులు స‌మ‌ర్థించుకుంటున్నారు. కేటీఆర్ పేరు పెట్ట‌డం వ‌ల్లేనా Tea stall shut down? సిరిసిల్ల రాజ‌న్న (Rajanna Sircilla) జిల్లా కేంద్రంలోని బ‌తుక‌మ్మ ఘాట్ వ‌ద్ద బ‌త్తుల శ్రీ‌నివాస్ అనే వ్య‌క్తి నాలుగేళ్లుగా టీస్టాల్ నిర్వ‌హిస్తున్నాడు. దానికి కేటీఆర్ టీస్టాల్ (KTR Tea Stall ) అనే పేరు పెట్టాడు. సైన్‌బోర్డుపై కేటీఆర్ ఫొటోను కూడా ప్ర‌ద‌ర్శించాడు. ఆ ప్రాంతంలో అభివృద్ధి ప‌నుల నిమిత్తం క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝా (Sandeep Kumar Jha) ఇటీవ‌ల పర్య‌టించారు. కేటీఆర్ (BRS working president KT Rama Rao) పేరుతో శ్రీ‌నివాస్ నిర్వ‌హిస్తున్న టీస...
HYDRAA | వ్యవసాయ భూముల కొనుగోలులో జాగ్ర‌త్త : హైడ్రా చీఫ్
State

HYDRAA | వ్యవసాయ భూముల కొనుగోలులో జాగ్ర‌త్త : హైడ్రా చీఫ్

HYDRAA హైదరాబాద్, ఇతర జిల్లాల్లో వ్యవసాయ భూముల‌ కొనుగోలు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైడ్రా (HYDRAA) చీఫ్ ఎ.వి. రంగనాథ్ హెచ్చరికలు జారీ చేశారు. కొంతకాలంగా హైదరాబాద్ న‌గ‌ర శివారులో కొంద‌రు వ్యవసాయ భూములను అక్ర‌మంగా ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ‌ని, కొనుగోలు దారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. వ్యాపారం పేరిట మోసం వ్య‌వసాయ భూముల‌ను ప్లాట్లుగా అమ్మిన వారు త‌మ‌ను మోసించార‌ని సోమ‌వారం జరిగిన ప్రజావాణి (Prajavani Grievance Redressal) కార్యక్రమంలో అనేక మంది ఫిర్యాదులు చేశారు. ఇవి HYDRAA దృష్టికి వచ్చాయి. ఇందులో ప్రజలు అక్రమంగా జరుగుతున్న వ్యవసాయ స్థలాల విక్రయాలపై తమ ఆందోళనను వ్యక్తం చేశారు. తెలంగాణ మునిసిప‌ల్‌ చట్టం 2019 (Telangana Municipalities Act 2019), తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 (Telangana Panchayat Raj Act 2018) ప్రకారం వ్యవసాయ భూములను ఏ ...
KCR birthday | బీఆర్ఎస్ ఫ్లెక్సీల తొల‌గింపు.. ఉద్రిక్త‌త‌
State

KCR birthday | బీఆర్ఎస్ ఫ్లెక్సీల తొల‌గింపు.. ఉద్రిక్త‌త‌

Removes KCR birthday flex : బీఆర్ఎస్ (BRS ) ఫ్లెక్సీలు, జెండాల‌ తొల‌గింపు హైద‌రాబాద్‌లో ఉద్రిక్త‌త (Tensions)కు దారి తీసింది. ఆ పార్టీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర‌రావు జ‌న్మ‌దినం (KCR birthday) సంద‌ర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు వాటిని ఏర్పాటు చేయ‌గా గ్రేట‌ర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు తొల‌గించ‌డం వాగ్వాదానికి దారి తీసింది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆదేశాలతోనే ఫ్లెక్సీలు, జెండాల‌ను తొల‌గించార‌ని బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న‌కు దిగారు. కేసీఆర్ జ‌న్మ‌దినం.. న‌గ‌ర‌మంతా గులాబీమ‌యం కేసీఆర్ (K Chandrashekhar Rao) జ‌న్మ‌దినం సంద‌ర్బంగా బీఆర్ఎస్ శ్రేణులు హైద‌రాబాద్ (Hyderabad) అంత‌టా ఫ్లెక్సీలు (flex posters) జెండాల‌తో గులాబీమ‌యం చేశారు. దీంతో ఆదివారం రాత్రి నుంచి సోమ‌వారం ఉద‌యం వ‌ర‌కు GHMC, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) సిబ్బంది వాటిని తొల‌గించారు. ఈ చ‌ర్...
error: Content is protected !!