Bird Flu | చికెన్ ప్రియులకు షాక్.. ఏపీలో బర్డ్ ఫ్లూ కేసులు.. తెలంగాణలో అలర్ట్…
Bird Flu Cases in Telugu States | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో బర్డ్ ఫ్లూ (Bird Flu) కేసులు వెలుగుచూడడంతో తెలంగాణ ప్రభుత్వం (Telangana) అలర్ట్ అయింది. చికెన్ ప్రియులకు, కోళ్ల పెంపకందారులకు, చికెన్ వ్యాపారులకు సర్కారు హెచ్చరికలు జారీ చేసింది.కోళ్లకు వ్యాపిస్తున్న బర్డ్ ఫ్లూ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లా (Godavari districts)లతో పాటు ఇతర జిల్లాల్లో భారీ సంఖ్యలో కోళ్ల మరణాలకు ఏవియన్ ఇన్ ప్లూయెంజా (H5N1– Bird Flu) వైరస్ కారణమని అధికారులు తాజాగా గుర్తించారు.ఈ వ్యాధి తెలంగాణకు కూడా విస్తరించనుందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రోజులపాటు కోళ్ల పెంపకం.. చికెన్ కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ()హెచ్చరికలు జారీ చేసింది.
కోళ్లు, ఇతర జంతువుల అనుమానాస్పదంగా మృత్యువాత పడిన వివరాలను ఎప్పటికప్పుడు తెల...




