Sarkar Live

State

Thandel Movie | తండేల్ మూవీకి దేవీనే సెకండ్ హీరో…
State

Thandel Movie | తండేల్ మూవీకి దేవీనే సెకండ్ హీరో…

Tollywood News | కస్టడీ, థాంక్యూ మూవీస్ ఫ్లాప్ ల తర్వాత ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్యకు (Naga Chaitanya) తండేల్ (Thandel Movie) రూపంలో బ్లాక్ బస్టర్ హిట్టు దక్కింది. విడుదలైన మొదటి రోజే మంచి టాక్ వచ్చింది. సెకండ్ రోజు కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మూవీలో నాగచైతన్య, సాయి పల్లవి (Sai Pallavi) నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ సూపర్ గా వర్క్ అవుట్ అయింది. డైరెక్టర్ చందు మొండేటి (Chandu mondeti) టేకింగ్ బాగుంది. ఈ మూవీకి మ్యూజిక్ పెద్ద అస్సెట్ గా నిలిచింది. మ్యూజిక్ డైరెక్టర్ గా డీఎస్పీ ని (Devi Sri Prasad) తీసుకోవడం మంచిదయింది. అల్లు అర్జున్ ఇచ్చిన సలహా మూవీకి బాగా ప్లస్ అయింది. మొదట మ్యూజిక్ డైరెక్టర్ గా వేరే వాళ్ళను తీసుకోవాలని అనుకున్నారట. ఈ విషయమై ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind)తన కొడుకు బన్నీకి చెబితే డీ ఎస్పీ నే తీసుకోండి అని చెప్...
Bird flu | తెలంగాణలో బర్డ్‌ఫ్లూ క‌ల‌క‌లం.. స‌ర్కారు అప్ర‌మ‌త్తం
State

Bird flu | తెలంగాణలో బర్డ్‌ఫ్లూ క‌ల‌క‌లం.. స‌ర్కారు అప్ర‌మ‌త్తం

Bird flu cases in Telangana | భారతదేశంలో బ‌ర్డ్‌ఫ్లూ (Avian Influenza) కేసులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో తెలంగాణ‌ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. రాష్ట్రంలో ఇది వ్యాపించ‌కుండా ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా ప‌శు సంవ‌ర్థ‌క శాఖ (Veterinary and Animal Husbandry) ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ రూపొందించింది. రాష్ట్రంలోని కోళ్ల పెంపకందారులు, పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులతో స‌మావేశ‌మై బర్డ్‌ఫ్లూ వ్యాప్తి, తీసుకోవాల్సిన ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల‌పై అవగాహ‌న క‌ల్పిస్తోంది. ప్ర‌జ‌ల‌కు కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌లు సూచ‌న‌లు చేస్తోంది. బ‌ర్డ్‌ఫ్లూ ప్ర‌స్తుతం ప్ర‌మాద‌క‌ర‌మేమీ కాద‌ని, ఎలాంటి భ‌యాందోళన‌కు గురికాకుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని అంటోంది. Bird flu : పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమ‌తుల‌పై నిషేధం బ‌ర్డ్‌ఫ్లూ (Bird flu) వ్యాపిస్తున్న నేప‌థ్యంలో రాష్ట్రంలోకి కోళ్లు, గుడ్లు, ...
Kodangal |  సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ లో రోడ్డెక్కిన విద్యార్థులు..
State

Kodangal | సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ లో రోడ్డెక్కిన విద్యార్థులు..

Kodangal : ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల వంటి రుచిపచీ లేని సాంబారు, ఒక్కపూట మాత్రమే అన్నం వడ్డింపు.. ఇదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సొంత నియోజకవర్గంలో విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనం తీరు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలం చెన్నారం పాఠశాలలో ఉడకని అన్నం నీళ్లలాంటి సాంబారు పెడుతున్నారని, అన్నం ఒక్కపూట మాత్రమే వడ్డిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. అలాగే గుడ్డు (Egg), అరటిపండు నెలలో ఒక్కసారి మాత్రమే పెడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై పిల్లల తల్లిదండ్రులు పలుమార్లు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని చెబుతున్నారు. ఈమేరకు గురువారం పాఠశాలలో భోజనం పెట్టకపోవడంతో ఆగ్రహించి పాఠశాల ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన (Students Protest) తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు, వంట నిర్వాహకులను వెంటనే మార్చాలని విద్...
TG News | శాశ్వ‌త జ‌డ్జిల‌ను నియ‌మించండి.. తెలంగాణ‌కు సుప్రీం సిఫార్సు
State

TG News | శాశ్వ‌త జ‌డ్జిల‌ను నియ‌మించండి.. తెలంగాణ‌కు సుప్రీం సిఫార్సు

TG News | తెలంగాణ హైకోర్టు (Telangana High court)కు ముగ్గురు న్యాయ‌మూర్తుల‌ను శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న నియ‌మించాల‌ని సుప్రీంకోర్టు సిఫార్సు చేసింది. మ‌ద్రాస్ హైకోర్టుకు ఇద్ద‌రిని నియ‌మించాల‌ని కూడా పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలో సుప్రీం కొలేజియం స‌మావేశంలో ఈ మేర‌కు ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చాయి. ఆ న్యాయ‌మూర్తులు ఎవ‌రెవ‌రంటే.. తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులు(Judges)గా ఉన్న న్యాయమూర్తి లక్ష్మీనారామ‌య‌ణ‌ అలిశెట్టి, న్యాయమూర్తి అనిల్ కుమార్ జుకంటి, న్యాయమూర్తి సుజానా కళాసికంలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని ప్ర‌తిపాదించిన‌ట్టు సుప్రీం (Supreme Court ) త‌న అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. అలాగే మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తులు వెంకటాచారి లక్ష్మీనారాయణన్, పెరియసామి వడమలైలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సిఫార్సు చేసినట్లు కొలేజియం తెలిపింది. ఏయే అంశాల‌ను ప...
Kumbh Mela | త్రివేణి సంగమంలో ప్రధాని మోడీ పుణ్యస్నానం (Video)
State

Kumbh Mela | త్రివేణి సంగమంలో ప్రధాని మోడీ పుణ్యస్నానం (Video)

Pragraj Kumbh Mela 2025 | ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) ఈరోజు కుంభమేళాలో ప్రత్యేక పూజలు నిర్వహించి పుణ్యస్నానం ఆచరించారు. ఉత్తరప్రదేశ్ లోని టెంపుల్ సిటీ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా (Maha Kumbh Mela 2025) లో పాల్గొన్నారు. ఆయన త్రివేణి సంగమం వద్ద పూజలతోపాటు పుణ్యస్నానం చేశారు. బుధవారం ప్రయాగ్ రాజ్‌కు చేరుకున్న ప్రధాని మోదీ… ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి కుంభమేళా త్రివేణి సంగమానికి వెళ్లారు. అక్కడి అరైల్ ఘాట్ నుంచి పడవలో సంగం ఘాట్‌కు చేరుకున్నారు ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహాకుంభమేళా ప్రాంతం గురించి సీఎం యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ను అడిగి సమాచారం తెలుసుకున్నారు. ఆ తర్వాత సంగం ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. . ఆ సమయంలో ప్రధాని మోడీ చేతిలో రుద్రాక్ష జపమాల పట్టుకుని మంత్రాలు జపిస్తూ త్రివేణి సంగమంలో స్నానమాచరించారు. భారతదే...
error: Content is protected !!