Osmania Hospital | 27 ఎకరాల విస్తీర్ణం.. 2వేల పడకలు అత్యాధునిక హంగులతో ఉస్మానియా హాస్పిటల్..
New Osmania Hospital : కార్పొరేట్ హాస్పిటల్ ను తలదన్నేలా అత్యాధునిక సౌకర్యాలతో ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి అడుగుపడింది. హైదరాబాద్ గోషామహల్ (Goshamahal) పోలీస్ గ్రౌండ్‌లో 27 ఎకరాల్లో సుమారు 2వేల కోట్ల అంచనా వ్యయంతో ఉస్మానియా కొత్త హాస్పిటల్ భవన నిర్మాణ పనులను సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. మొత్తం 30 డిపార్ట్‌మెంట్‌లు, 2వేల పడకలు, ఫిజియోథెరపీ, డెంటల్, కాలేజ్‌లు, హాస్టల్ వసతులతో అత్యాధునిక ఆస్పత్రిని నిర్మించనున్నారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (Osmania General Hospital )లో అనుగుణంగా హెలిప్యాడ్ వసతి, హాస్పిటల్ మురుగు నీరు శుద్ధి చేసేందుకు ప్రత్యేక ప్లాంట్, విశాలమైన పార్కింగ్ ఫెసిలిటీలను కల్పించనున్నారు. ఈ ఆస్పత్రిన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు.
ప్రతీ డిపార్ట్‌మెంట్కు ప్రత్యేక ఆపరేషన్ థియేటర్
...




