Sarkar Live

State

Infosys : ఇన్ఫోసిస్ గోపాలకృష్ణన్‌పై అట్రాసిటీ కేసు..  మరో 18 మందిపై న‌మోదు
State

Infosys : ఇన్ఫోసిస్ గోపాలకృష్ణన్‌పై అట్రాసిటీ కేసు.. మరో 18 మందిపై న‌మోదు

Infosys | ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ (Infosys co-founder Senapathy Kris Gopalakrishnan), ఐఐఎస్‌సీ డైరెక్ట‌ర్ బాలరాం (former IISc Director Balaram)తో పాటు మరో 16 మంది పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదైంది. ఓ త‌ప్పుడు కేసులో ఇరికిన త‌న‌ను ఐఐఎస్‌సీ నుంచి నిర్దాక్షిణ్యంగా తొల‌గించ‌డ‌మే కాకుండా త‌న‌ను కులం పేరుతో దూషించి అవ‌మాన‌ప‌ర్చార‌ని ఓ వ్య‌క్తి వీరిపై ఫిర్యాదు చేశాడు. దీంతో బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు నమోదైంది. ఫిర్యాదుదారుడి ఆరోప‌ణ‌లు తాను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) సెంట‌ర్‌లోని సస్టైనబుల్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌లో ఫ్యాక‌ల్టీగా ప‌నిచేశాన‌ని దుర్గ‌ప్ప అనే వ్య‌క్తి తెలిపారు. 2014లో తాను ఒక హనీ ట్రాప్ కేసు (honey trap case)లో తప్పుడు ఆరోపణలపై ఇరికాన‌ని, దీనిని సాకుగా చూపించి ఐఐఎస్‌సీ నుంచి తొల‌గించార‌ని పేర్కొన్నారు. Infosys...
CISF Jobs | సీఐఎస్ఎఫ్‌లో 10వ త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో ఉద్యోగాలు..
State

CISF Jobs | సీఐఎస్ఎఫ్‌లో 10వ త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో ఉద్యోగాలు..

CISF Jobs Notification : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో కానిస్టేబుల్/డ్రైవర్, కానిస్టేబుల్/డ్రైవర్-కమ్-పంప్ ఆపరేటర్ పోస్టుల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. దేశ‌వ్యాప్తంగా మొత్తం 1124 ఖాళీల‌ను భర్తీ చేయనున్నారు. ఇందుకు పురుష అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తును ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాల్లో రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు ఆకర్షణీయమైన జీతభత్యాలు ఉంటాయి. CISF Jobs Notification ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ప్రారంభం : 2025 ఫిబ్రవరి 3 |దరఖాస్తు ముగింపు : 2025 మార్చి 4 (11:59 PM)|(ఆన్‌లైన్ దరఖాస్తు త్వరలో ప్రారంభమవుతుంది) అర్హతలు విద్యార్హత : అభ్యర్థులు మాట్రిక్యులేషన్ (10వ తరగతి) లేదా సమానమైన పరీక్షను ఉత్తీర్ణులై ఉండాలి.సెంట్రల్ లేదా స్టేట్ బోర్డు, ఇతర బోర్డులు జారీ చేసిన సర్టిఫికెట్ క‌లిగి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ : హెవీ మోటార్ వెహికిల్స్ (HMV), లైట్ మోటార్ వె...
TG Employees | తెలంగాణ ఉద్యోగులు క‌ష్ట‌జీవులు.. స‌ర్వేలో ఆసక్తికర విషయాలు..
State

TG Employees | తెలంగాణ ఉద్యోగులు క‌ష్ట‌జీవులు.. స‌ర్వేలో ఆసక్తికర విషయాలు..

Survey on TG Employees | తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు క‌ష్ట‌జీవులు.. అంకిత‌భావం, నిబద్ధ‌త క‌లిగిన వారు. త‌మ విధుల్లో ఎక్కువ స‌మ‌యాన్ని వెచ్ఛిస్తారు. ఈ మాట‌లు అంటున్న‌దెవ‌రో కాదు.. సాక్షాత్తు ప్ర‌ధాన మంత్రి ఆర్థిక స‌ల‌హా మండ‌లి స‌భ్యురాలి రూపొందించిన‌ నివేదిక‌లే చెబుతున్నాయి. ఇండియాలో వారానికి 70 గంటల పని చేయాలని నిబంధ‌న‌లు ఉన్న‌ప్ప‌టికీ తెలంగాణలోని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగ ఉద్యోగులు అంత‌క‌న్నా ఎక్కువ స‌మ‌య‌మే వెచ్ఛిస్తూ విధులు నిర్వ‌ర్తిస్తున్నార‌ని వెల్ల‌డైంది. TG Employees : రోజుకు ఎన్ని గంట‌లు ప‌ని చేస్తున్నారంటే.. తెలంగాణ రాష్ట్రం (Telangana) లోని ఉద్యోగులు రోజుకు సగటున 433 నిమిషాలు (7.21 గంటలు) పనిచేస్తున్నారు. ఇది దేశ సగటు 422 నిమిషాలు (7.03 గంటలు) కంటే ఎక్కువ. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఆరు రోజుల పని వారాన్ని పరిగణనలోకి తీసుకుంటే వారానికి సగట...
Andariki Illu Scheme | అందరికీ ఇల్లు.. మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసిన ఏపీ స‌ర్కార్‌
State

Andariki Illu Scheme | అందరికీ ఇల్లు.. మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసిన ఏపీ స‌ర్కార్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (Government of Andhra pradesh) అందరికీ ఇల్లు పథకం (Andariki Illu Scheme) అమలుకు సంబంధించి మార్గదర్శకాల (Guidelines )ను విడుదల చేసింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా ఈ రోజు (సోమవారం) ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ మార్గదర్శకాలను క‌చ్చితంగా అమ‌లు చేసి ఇల్లు లేని ప్ర‌తి ఒక్క‌రికీ ల‌బ్ధి చేకూరేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేశారు. Andariki Illu Scheme : నిలువ నీడ కల్పించేందుకు.. పేద కుటుంబాలకు గృహ సౌకర్యం అందించడ‌మే అంద‌రికీ ఇల్లు ప‌థ‌కం ముఖ్యోద్దేశం. సొంత భూమి లేక నిలువ నీడ‌లేని వారికి గృహ వస‌తిని క‌ల్పించేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌ల్లోకి తెచ్చింది. అర్హ‌త‌లు ఏముండాలంటే.. అంద‌రికీ ఇల్లు ప‌థ‌కం (Andariki Illu Scheme)లో భాగంగా పేద కుటుంబాలకు 3 సెంట్లు, ప‌ట్ట‌ణ ప్రాంతాల వార...
Raithu Bharosa | అకౌంట్లు చెక్ చేసుకోండి.. ఆ రెండు ప‌థ‌కాల పైస‌లు ప‌డేది నేడే..
State

Raithu Bharosa | అకౌంట్లు చెక్ చేసుకోండి.. ఆ రెండు ప‌థ‌కాల పైస‌లు ప‌డేది నేడే..

Raithu Bharosa Scheme | రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించింది. రైతు భరోసా(Raithu Bharosa Scheme) , ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌ కార్డులు మంజూరుకు శ్రీ‌కారం చుట్టింది. జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని మండలాల్లోని గ్రామాల్లో ఈ రోజు (జనవరి 27) నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నాలుగు పథకాల ద్వారా రైతులు, కూలీలు, పేద కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించడం లక్ష్యం. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో (Bank Accounts) నేరుగా జమ చేస్తున్నారు. Raithu Bharosa : అకౌంట్లో డ‌బ్బులు జ‌మ కాక‌పోతే.. రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులు, సంబంధిత అధికారులను పథకాల అమలుకు సిద్ధం చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. త‌మ అకౌంట్లలో నగదు జమ కాకపోతే స్థానిక అధికారులను సంప్రదించాల‌ని ల‌బ్ధి...
error: Content is protected !!