Sarkar Live

State

Accident | వ‌రంగ‌ల్‌లో ఘోర ప్రమాదం.. ఏడుగురి దుర్మ‌రణం
State

Accident | వ‌రంగ‌ల్‌లో ఘోర ప్రమాదం.. ఏడుగురి దుర్మ‌రణం

వ‌రంగ‌ల్ (Warangal)లో ఘోర ప్రమాదం (Road Accident) జ‌రిగింది. లారీలో ఉన్న ఇనుప రాడ్ల (iron bars) లోడు రెండు ఆటోల‌పై ప‌డ‌టంతో ఏడుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి (instant death) చెందారు. మ‌రో ఆరుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వ‌రంగ‌ల్‌-మామునూరు ర‌హ‌దారిపై ఈ రోజు ఉద‌యం 11 గంట‌ల‌కు ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఓవ‌ర్ లోడ్‌.. ఓవ‌ర్‌టేక్‌ రైల్వే ట్రాక్స్ (railway track)కు ఉప‌యోగించే ఇనుప రాడ్ల‌ను త‌ర‌లిస్తున్న లారీ భార‌త్ పెట్రోల్ బంక్ స‌మీపంలోకి రాగానే రెండు ఆటో రిక్షాల‌ను ఓవ‌ర్‌టేక్ చేయ‌డానికి ప్రయ‌త్నించింది. వేగంగా ముందుకు దూసుకెళ్లే క్ర‌మంలో అందులోని ఇనుప రాడ్లు క‌ద‌లి ఆ ఆటోల‌పై ప‌డ్డాయి. దీంతో ఏడుగురు దుర్మ‌ణం పాల‌య్యారు. మృతుల్లో న‌లుగురు మ‌హిళ‌లు, ఒక చిన్నారి ఉన్నారు. వీరి పూర్తి వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది. Warangal Accident : క్ష‌త‌గాత్రుల ప‌రిస్థితి విష‌మం ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన ఆరుగురిన...
EV | దేశంలో ఈవీల విప్ల‌వం.. వినియోగంలో భారీ వృద్ధి..
State

EV | దేశంలో ఈవీల విప్ల‌వం.. వినియోగంలో భారీ వృద్ధి..

Green Mobility | ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా భార‌త‌దేశంలో ఈ వెహికిల్స్ వాడ‌ట‌కం గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. 2030 నాటికి వార్షిక వాహన అమ్మకాల్లో 30-35 శాతం వాటా ఎలక్ట్రిక్ వాహనాలదే ఉండ‌బోతోంద‌ని ఓ స‌ర్వేలో తేలింది. 2024 నుంచి 2030 మధ్య కాలంలో భారతదేశం ఈ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోందని SBI క్యాపిటల్ మార్కెట్స్ (SBICAPS) నివేదిక చెబుతోంది. అయితే.. అంతర్గత దహన ఇంజిన్ (Internal Combustion Engine) వాహనాల వినియోగం కూడా దీంతోపాటే కొన‌సాగుతుంద‌ని వైల్ల‌డైంది. EV లపై పెరుగుతున్న ఆద‌ర‌ణ‌ EVల వినియోగం తొలుత చాలా త‌క్కువ‌గా ఉండేది. 2019లో ఒక శాతం కూడా లేదు. క్ర‌మేణా పెరుగుతూ 2024 నాటికి 7.4 శాతానికి పెరిగింది. ఎక్కువ ఫీచ‌ర్లు క‌లిగి ఉండ‌టం వ‌ల్ల ఈ వాహ‌నాలు వినియోగ‌దారుల ఆద‌ర‌ణ పొందుతున్నాయి. పైగా మెయింట‌నెన్స్ చాలా త‌క్కువ‌గానే ఉండ‌టంతో వీటిని...
Govt Schemes | రేపే కొత్త ప‌థ‌కాల పండుగ .. అక్కడికక్కడే లబ్ధిదారులకు మంజూరు పత్రాలు..
State

Govt Schemes | రేపే కొత్త ప‌థ‌కాల పండుగ .. అక్కడికక్కడే లబ్ధిదారులకు మంజూరు పత్రాలు..

Telangana Govt Schemes : తెలంగాణ సర్కారు నాలుగు కొత్త పథకాలను రేపు ప్రారంభించేందుకు సిద్ధమైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా అమ‌లుచేయ‌నున్న‌ రైతు భరోసా (Rythu bharosa), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ(Ration Cards), ఇందిరమ్మ ఇండ్ల పథకాలను (Indiramma housing Scheme) రేపు ప్రారంభించ‌నున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి గ్రామ‌స‌భ‌లో ల‌బ్ధిదారుల‌కు మంజూరు ప‌త్రాల‌ను అందించ‌నున్నారు. నాలుగు పథ‌కాల ప్రారంభం, అమ‌లుతీరుపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వేర్వేరుగా శ‌నివారం స‌మీక్ష స‌మావేశాలు నిర్వ‌హించారు. ప‌విత్ర దినోత్స‌వ‌మైన గణతంత్ర దినోత్సవం నాడు ఈ నాలుగు పథకాలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సి.ఎస్ శాంతి కుమారి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించి దిశానిర్ద...
GSLV-F15 : ఇస్రో అద్భుత‌ ఆవిష్క‌రణ.. 100వ‌ మైలురాయిగా జీఎస్ఎల్‌వీ-ఎఫ్‌15 ప్ర‌యోగం
State

GSLV-F15 : ఇస్రో అద్భుత‌ ఆవిష్క‌రణ.. 100వ‌ మైలురాయిగా జీఎస్ఎల్‌వీ-ఎఫ్‌15 ప్ర‌యోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) తన సరికొత్త రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. 2025 జనవరి 29న‌ ఉదయం 6:23 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (SDSC) నుంచి GSLV-F15/NVS-02 మిషన్‌ను ప్ర‌యోగ‌నించ‌నుంది. ఇది ISROకు ఒక ప్రత్యేక ఘట్టం. ఇది శ్రీహరికోటలో జరిగిన 100వ ప్రయోగం ఇది. GSLV-F15 ప్రాధాన్యం శ్రీహరికోట నుంచి మొదటి రాకెట్ SLVను 1979 ఆగస్టు 10న ప్ర‌యోగించిన ఇస్రో అనేక మైలురాళ్లు దాటుతూ సుదీర్ఘ ప్ర‌యాణం చేస్తోంది. ఈ 46 ఏళ్ల‌లో ISRO ఎన్నో విజయవంతమైన ప్రయోగాలను పూర్తి చేసింది. కొత్త‌గా తన 100వ ప్రయోగాన్ని చేప‌డుతోంది. ఇది భారత అంతరిక్ష పరిశోధనలో నూతన అధ్యాయ‌నానికి నాంది పలుకుతోంది. ISRO సుదీర్ఘ ప్రయాణం GSLV-F15 (జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్) ప్ర‌యోగం ఇస్రోకు ప్ర‌ధాన మైలురాయి లాంటిది.దీని ద్వారా NVS-02 శాటిలైట్‌ను జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బి (Geosynchronous...
Karimnagar | బీజెపి ఆకర్ష్..  కమలం గూటికి క‌రీంన‌గ‌ర్ మేయ‌ర్‌, కార్పొరేట‌ర్లు
Districts

Karimnagar | బీజెపి ఆకర్ష్.. కమలం గూటికి క‌రీంన‌గ‌ర్ మేయ‌ర్‌, కార్పొరేట‌ర్లు

Karimnagar BRS Party | కరీంనగర్‌లో రాజకీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్‌ఎస్ (BRS), బీజేపీ(BJP)ల మ‌ధ్య ఉన్న పొలిటిక‌ల్ వార్ అనేక మ‌లుపులు తిరుగుతోంది. తాజా బీఆర్‌ఎస్ భారీ షాక్ త‌గిలింది. క‌రీంన‌గ‌ర్ మునిసిప‌ల్ కార్పొష‌న్ (Karimnagar Municipal Corporation) మేయ‌ర్ స‌హా 10 మంది కార్పొరేటర్లు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వీరంతా క‌మ‌లం పార్టీ గూటికి చేరారు. బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) సమక్షంలో తీర్థం పుచ్చుకున్నారు. అవినీతిని భ‌రించ‌లేకే : మేయ‌ర్ బీఆర్‌ఎస్‌లో అవినీతి పేరుకుపోవ‌డం వ‌ల్లే తాము ఆ పార్టీని వీడామ‌ని మేయర్ యాద‌గిరి సునీల్‌రావు (Yadagiri Sunil Rao) వెల్ల‌డించారు. బీఆర్‌ఎస్ హ‌యాంలో రివర్ ఫ్రంట్, స్మార్ట్ సిటీ వంటి ప్రాజెక్టుల్లో భారీ స్కామ్‌ చోటు చేసుకుందని ఆరోపించారు. దీని వెనుక ఉన్న బీఆర్‌ఎస్ నేతల పేర్లను త్వరలోనే బయటపెడతానని తెలిపారు. “ఆ పార్టీకి నేను ...
error: Content is protected !!