Sarkar Live

State

Formula e Car Race : కేటీఆర్‌కు చుక్కెదురు.. పిటిష‌న్‌ను తిర‌స్క‌రించిన హైకోర్టు
State

Formula e Car Race : కేటీఆర్‌కు చుక్కెదురు.. పిటిష‌న్‌ను తిర‌స్క‌రించిన హైకోర్టు

Formula e Car Race : భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు (KTR)కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయ‌న దాఖ‌లు చేసిన పిటిషన్‌ను న్యాయ‌స్థానం తిర‌స్క‌రించింది. ఫార్ములా-ఈ రేస్ స్కాంలో అవినీతి నిరోధక సంస్థ‌ (ACB) ఆయ‌న‌పై కేసు న‌మోదు చేసిన విష‌యం విదిత‌మే. ఈ కేసులో అరెస్టు చేయ‌కుండా త‌న‌కు వెసులుబాటు క‌ల్పించాల‌ని కోరుతూ కేటీఆర్‌ హైకోర్టును ఆశ్ర‌యించ‌గా ఆయ‌న అభ్య‌ర్థ‌న‌ను న్యాయ‌మూర్తి తిర‌స్క‌రించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా-ఈ రేస్ కోసం గ‌త‌ ప్రభుత్వం ఖర్చుచేసిన నిధుల దుర్వినియోగం ఆరోపణల నేప‌థ్యంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు న‌మోదైంది. ఫార్ములా-ఈ రేస్‌లో రూ. 54.88 కోట్ల అవినీతి జ‌రిగింద‌ని ప్ర‌ధాన ఆరోప‌ణ‌. 2024 డిసెంబరు 19న ACB కేటీఆర్‌పై కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)(A), 13(2), ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 409, 120(B) సెక్ష‌...
HMPV threat : హ్యాండ్‌షేక్ వద్దు.. నమస్కారమే ముద్దు..
State

HMPV threat : హ్యాండ్‌షేక్ వద్దు.. నమస్కారమే ముద్దు..

HMPV threat : హైదరాబాద్: భార‌త్‌లో HMPV వైర‌స్ ప్ర‌వేశించ‌డంతో అంద‌రూ భ‌యాందోళ‌న చెందుతున్నారు. క‌రోనా మాదిరి వ్యాపించే ల‌క్ష‌ణాలు క‌లిగి ఉండ‌డంతో ముంద‌స్తు జాగ్ర‌త్తలు పాటించాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వైర‌స్ వ‌ల్ల ప్రాణ‌భ‌యం లేద‌ని అంత‌గా భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని చెబుతున్నారు.ఇదిలా ఉండ‌గా హైదరాబాద్, బంజారాహిల్స్ లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) బ్రాంచ్ 'నమస్కారం ముద్దు-కరచాలనం వద్దు' అనే నినాదాన్ని ఇస్తోంది. అంటే షేక్ షేక్‌కు బదులుగా చేతులు జోడించి పలకరించే అలవాటును మొద‌లుపెట్టాల‌ని సూచిస్తోంది. సీజనల్ ఫ్లూ కేసులు, హైదరాబాద్‌లో హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) ముప్పు నేప‌థ్యంలో ఈ నినాదాన్ని ముందుకు తెచ్చింది. HMPV threat : ముందుజాగ్రత్తలు: తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు మీ నోరు, ముక్కును రుమాలు లేదా టిష్యూతో క‌వ‌ర్ చేసుకోవాలి. సబ్బు/హ్యాండ్ శానియిజర్‌తో తరచుగా చ...
HMPV : చైనా వైరస్ విజృంభణ.. ఇండియాలో కేసులు న‌మోదు
State

HMPV : చైనా వైరస్ విజృంభణ.. ఇండియాలో కేసులు న‌మోదు

చైనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. క్ర‌మేణా విస్త‌రిస్తోంది. బెంగళూరులో మానవ మెటాప్న్యుమో వైరస్ (HMPV) రెండు కేసులు నమోద‌య్యాయి. భారతదేశంలో హెచ్ఎంపివి వైరస్ మొదటి కేసులు ఇవే. ఎనిమిది, మూడు నెల‌ల‌ ఇద్ద‌రు శుశువులు దీని బారిన ప‌డ్డారు. ఎనిమిది నెలల శిశువు చికిత్స పొందుతుండ‌గా, మూడు నెలల శిశువును ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. వేగంగా వ్య‌ప్తి చెందుతున్న వైర‌స్‌ ప్రస్తుతం చైనాలోహెచ్ఎంపివి వైరస్వ్యాప్తి విపరీతంగా ఉంది. సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇన్‌ఫ్లూయెంజా A, HMPV, మైకోప్లాజ్మా న్యూమోనియా, కొవిడ్-19 వంటి అనేక వైరస్‌లు చైనాలో వ్యాప్తి చెందుతున్నాయి. శ్వాస సంబంధిత అనారోగ్యంతో బాధప‌డుతున్న అక్క‌డి బాధితుల వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. HMPV అంటే ఏమిటి? HMPV అంటే హ్యూమన్ మెటాప్న్యుమో వైరస్. ఇది మొద‌ట 2001లోనే వెలుగులోకి వ‌చ్చింది. ఈ వైర‌స్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌ను ...
Charlapalli : చర్ల‌ప‌ల్లి రైల్వే ట‌ర్మిన‌ల్‌ను ప్రారంభించిన మోదీ
State

Charlapalli : చర్ల‌ప‌ల్లి రైల్వే ట‌ర్మిన‌ల్‌ను ప్రారంభించిన మోదీ

చ‌ర్లప‌ల్లి రైల్వే ట‌ర్మిన‌ల్ (Charlapalli railway terminal)ను ప్ర‌ధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఈ రోజు ప‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు ఈ ట‌ర్నిన్‌ను నిర్మించారు. విమానాశ్ర‌యాల్లో మాదిరి అత్యాధునిక సౌక‌ర్యాల‌తో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇందుకు రూ. 430 కోట్ల వెచ్ఛించారు. రోజుకు సుమారు 50 వేల మంది ప్రయాణికులకు ఇది సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. ఇప్పటికే రద్దీతో నిండిన సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లతో పోలిస్తే కొత్తగా ప్రారంభించిన ఈ టెర్మినల్ అనేక రైళ్లను ప్రారంభ కేంద్రంగా రూపాంత‌రం చెందింది. చెన్నై, ఢిల్లీ, కోలకతా, విశాఖపట్నం వంటి ప్రధాన స్టేష‌న్ల‌కు వెళ్లే రైళ్లు ఇప్పుడు చార్లపల్లి టెర్మినల్ నుంచి నడుస్తాయి. Charlapalli railway Station లో అత్యాధునిక సౌక‌ర్యాలు ఇవే… చ‌ర్ల‌ప‌ల...
OYO Rooms New Booking Policy : పెళ్లి కాలేదా.. అయితే, నో ప‌ర్మిష‌న్‌.. ఓయో కొత్త పాల‌సీ
State

OYO Rooms New Booking Policy : పెళ్లి కాలేదా.. అయితే, నో ప‌ర్మిష‌న్‌.. ఓయో కొత్త పాల‌సీ

OYO Rooms New Booking Policy : పెళ్లికాని జంట‌లు ఇక నుంచి OYOకు వెళ్ల‌డం కుద‌ర‌దు. పెళ్లి అయ్యింద‌ని బుకాయించి రూమ్ బుక్ చేసుకుందామ‌న్నా వీలు కాదు. మ్యారీడ్ క‌పుల్‌కు మాత్ర‌మే ఇక నుంచి OYO రూములు బుక్ చేసుకొనే అనుమ‌తి ఉంటుంది. ఈ కొత్త విధానాన్నిOYO సంస్థ అమ‌ల్లోకి తెచ్చింది. ప్ర‌స్తుతం యూపీలో ప్ర‌యోగాత్మ‌కంగా చేపట్టిది. త్వ‌ర‌లోనే దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేయ‌నుంది. OYOకు వెళ్తే.. ఆధారాలు ఉండాల్సిందే.. ట్రావెల్ బుకింగ్ దిగ్గజం OYO సంస్థ తమ భాగస్వామ్య హోటళ్ల కోసం కొత్త చెక్-ఇన్ విధానాన్ని ప్రారంభించింది. ఇది మొదటగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీరట్‌లో అమల్లోకి వ‌చ్చింది. పెళ్లి కాని జంటలు హోట‌ల్‌కు వెళ్తే ఇక నుంచి రూములు ఇవ్వ‌రు. పెళ్ల‌యిన వారు బుక్ చేసుకోవాలంటే అందుకు ఆధారాలు చూపించారు. అప్పుడే అనుమ‌తినిస్తారు. జంటలు చెక్-ఇన్ సమయంలో త‌మ వైవాహిక సంబంధాన్ని రుజువు చేసే ఆధారాల‌ను స‌మ‌ర్పించాల్సి ఉ...
error: Content is protected !!