Heavy rains | మళ్లీ ముంచెత్తనున్న వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
Heavy rains : భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ (Hyderabad) కేంద్రం తాజాగా జారీ చేసిన అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఏడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఇప్పటికే సెప్టెంబరు చివరి వారంలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని సూచనలు వెలువడగా, ఇప్పుడు మరింత స్పష్టమైన హెచ్చరికను విడుదల చేశారు.
మోస్తరు నుంచి భారీ వర్షాలు
రాష్ట్రమంతా భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తూ India Meteorological Department (IMD) ఎల్లో అలర్ట్ (yellow alert) జారీ చేసింది. సెప్టెంబరు 28 వరకు ఇది కొనసాగనుంది. తెలంగాణలోని ఉత్తర, మధ్య, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని IMD వెల్లడించింది. పలు జిల్లాల్లో వర్షాలు, పిడుగులు, ఈదురుగాలులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని తెలిపింది. కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు...




