Sarkar Live

State

భార్యను కట్టేసి చిత్రహింసలు పెట్టిన భర్త అరెస్ట్ – Prakasam Incident
AndhraPradesh

భార్యను కట్టేసి చిత్రహింసలు పెట్టిన భర్త అరెస్ట్ – Prakasam Incident

సహకరించిన కుటుంబ సభ్యులు కూడా Prakasam Incident | భార్యను తాళ్లతో కట్టి రాత్రి 9 నుంచి వేకువజామున 5 గంటల వరకూ చిత్రహింసలు పెట్టిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. అత‌డికి స‌హ‌క‌రించిన అక్క, మేనల్లుడితోపాటు ఈ దారుణాన్ని వీడియో తీసిన బాలాజీ ప్రియురాలును సైతం అదుపులోకి తీసుకున్నారు. వివాహిత‌ను రెండు చేతులను రెండు క‌ర్ర‌ల‌కు కట్టేసి తీవ్రంగా హింసించి చంపేందుకు య‌త్నించిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాను షేక్ చేశాయి. దీనిపై నెటిజ‌న్లు తీవ్రంగా స్పందించి నిందితుల‌ను వెంట‌నే అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేశారు. Prakasam Incident : ఏం జరిగింది? భాగ్యలక్ష్మి అనే మహిళను బాలాజీ తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కానీ కొంతకాలంగా భార్య పిల్లలను వద...
బీసీలకు రాజ్యాధికార‌మే ల‌క్ష్యంగా తీన్మార్ మ‌ల్ల‌న్న కొత్త పార్టీ – Teenmar Mallanna New Party
State, Hyderabad

బీసీలకు రాజ్యాధికార‌మే ల‌క్ష్యంగా తీన్మార్ మ‌ల్ల‌న్న కొత్త పార్టీ – Teenmar Mallanna New Party

Teenmar Mallanna New Party : తెలంగాణ రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటైంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త పార్టీని ఈరోజు స్థాపించారు. త‌న పార్టీకి తెలంగాణ రాజ్యాధికార పార్టీ (Telangana Rajyadhikara Party -TRP) పేరు పెట్టారు. బుధ‌వారం హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో తన కొత్త పార్టీ వివరాలను తీన్మార్ మ‌ల్ల‌న్న‌ వెల్ల‌డించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన జెండా మధ్యలో కార్మిక చక్రం, పిడికిలి బిగించిన చేయి, దాని చుట్టూ ఆలీవ్ ఆకులు ఉన్నాయి. జెండాపై 'ఆత్మగౌరవం, అధికారం, వాటా' అని రాసి ఉంది. బీసీల ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండాగా తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపిస్తున్నట్లు తీన్మార్ మల్లన్న (MLC Teenmar Mallanna) ఈసంద‌ర్భంగా తెలిపారు. ‘తెలంగాణ గడ్డ మీద బీసీలు తమకు తాముగా ఒక రాజకీయ పార్టీని తీసుకొస్తున్నారు. బీసీల ఆ...
Future City : ఫ్యూచర్ సిటీపై వెనుక‌డుగు లేదు..
State, Hyderabad

Future City : ఫ్యూచర్ సిటీపై వెనుక‌డుగు లేదు..

భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ ప్రాజెక్టు (Bharat Future City)పై వెనుక‌డుగు వేసేది లేద‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్‌రెడ్డి (Chief Minister A Revanth Reddy) తేల్చి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి (development of the State)కి ఇది త‌ప్ప‌నిస‌రి అన్నారు. రైతుల నిర‌స‌న‌ల పేరుతో ప్ర‌తిప‌క్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయ‌ని విమ‌ర్శించారు. ప్రాజెక్ట్ కోసం భూములు, ఇళ్ల‌ను ఇవ్వాలని నోటిఫై చేసిన గ్రామాల ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. హైద‌రాబాద్ (Hyderabad)లో ఈ రోజు జ‌రిగిన తెలంగాణ ప్ర‌జా ప‌రిపాల‌న దినోత్స‌వం (Telangana Praja Palana Dinotsavam) సంద‌ర్భంగా సీఎం త‌న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’పై మ‌రోసారి మాట్లాడారు. అభివృద్ధిని అడ్డుకోవ‌డ‌మే ప్ర‌తిప‌క్షాల ఉద్దేశం రైతులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ ఇవన్నీ ప్రతిపక్ష పార్టీల (opposition parties) ప్రేరేపించ‌డం వల్లే జరుగుతున్నాయని ముఖ్య‌మంత్రి రేవంత్‌...
Aarogyasri | చేతులు ఎత్తేసిన ఆస్పత్రుల యాజ‌మాన్యాలు.. ఆరోగ్య‌శ్రీ సేవ‌లు బంద్‌
State, Hyderabad

Aarogyasri | చేతులు ఎత్తేసిన ఆస్పత్రుల యాజ‌మాన్యాలు.. ఆరోగ్య‌శ్రీ సేవ‌లు బంద్‌

Hyderabad : తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ (Aarogyasri), ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS), జర్నలిస్టుల ఆరోగ్య పథకం (JHS) సేవ‌లు బంద్ అయ్యాయి. రాష్ట్ర‌ప్ర‌భుత్వం చెల్లించాల్సిన బ‌కాయిలు రాక‌పోవ‌డంతో ఈ పథకాల కింద చికిత్స అందిస్తున్న ప్రైవేట్ ఆస్ప‌త్రుల (Private hospitals) యాజ‌మాన్యాలు చేతులు ఎత్తేశాయి. త‌మ‌కు బ‌కాయి ఉన్నవేల‌కోట్ల నిధుల‌ను విడుద‌ల చేయ‌మ‌ని అనేక సార్లు విన్న‌వించినా రాష్ట్ర ప్ర‌భుత్వం పెడ‌చెవిన పెట్ట‌డం వ‌ల్లే ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని తెలంగాణ ఆరోగ్య‌శ్రీ నెట్‌వ‌ర్క్ అసోసియేష‌న్ (TANHA) ప్ర‌క‌టించింది. విఫ‌లమైన చ‌ర్చ‌లు.. నిలిచిపోయిన సేవ‌లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (TANHA) ప్రతినిధులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మంగ‌ళ‌వారం చర్చలు జరిపారు. ఇవి సుదీర్ఘంగా కొన‌సాగాయి. అయినా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో TANHA ప్ర‌తినిధులు ఓ...
Hyderabad : మాకు ఎవ‌రి జోక్యం అవ‌స‌రం లేదు.. ట్రంప్‌పై రాజ్‌నాథ్ సింగ్ విసుర్లు – Rajnath Singh
State, Hyderabad

Hyderabad : మాకు ఎవ‌రి జోక్యం అవ‌స‌రం లేదు.. ట్రంప్‌పై రాజ్‌నాథ్ సింగ్ విసుర్లు – Rajnath Singh

Rajnath Singh : హైదరాబాద్ లిబరేషన్ డే సందర్భంగా దేశ రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh) చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. తాను జోక్యం చేసుకోవ‌డం వ‌ల్లే భారత్-పాకిస్తాన్ మ‌ధ్య యుద్ధం ఆగింద‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) చేసిన వ్యాఖ్య‌ల‌ను రాజ్‌నాథ్ ఖండించారు. భారత్ ఎప్పుడూ ఉగ్రవాదంపై తన సొంత‌ నిర్ణయాలతో చర్యలు తీసుకుంటుంది. ఎవ‌రి జోక్యం అస‌వ‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. భారతదేశంలో హైద‌రాబాద్ విలీన‌మైన సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం లిబ‌రేష‌న్ డే (Hyderabad Liberation Day)ను ప్ర‌తి సంత్స‌రం నిర్వ‌హిస్తోంది. సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్‌లో ఈ వేడుక‌లు ఇవాళ ఘ‌నంగా జ‌రిగాయి. ముఖ్య అతిథిగా హాజ‌రైన రాజ్‌నాథ్‌సింగ్ జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. అమ‌ర‌వీరుల‌కు నివాళుల‌ర్పించారు. అనంత‌రం మాట్లాడుతూ ఇండో-పాక్ సంబంధాలపై కీల‌క...
error: Content is protected !!