Security Jobs | ట్రాన్స్‌జెండర్లకు మెట్రో రైళ్లలో సెక్యూరిటీగా విధులు
Security Jobs in Hyderabad Metro | “ట్రాన్స్‌జెండర్లు (Transgenders) ఎందులోనూ తక్కువ వారు కాదు, తలెత్తుకుని బతికే వారని సమాజానికి నిరూపించే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో గౌరవప్రదమైన అవకాశాన్ని కల్పించింది” అని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్‌ల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్‌ల వద్ద భిక్షాటన చేసిన వారికి ట్రాఫిక్ నియంత్రణలో అవకాశాలు కల్పించగా, ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైళ్లలో 20 మందిని సెక్యూరిటీ గార్డులుగా నియమించడం చారిత్రాత్మక నిర్ణయంగా నిలిచిందన్నారు.మంగళవారం మంత్రి ఛాంబర్లో 20 మంది ట్రాన్స్‌జెండర్‌లకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సెక్యూరిటీ వార్డులుగా నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సెక్యూరిటీ గార్డు (Security Jobs) నియామకాల కోసం దాదాపు 300–400 మంది దరఖాస్తు చేసుకోగా, నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేశామని తె...




