Aarogyasri | ఆగస్టు 31 నుండి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తాం : నెట్‌వర్క్ ఆసుపత్రులు
Aarogyasri | “ఆరోగ్యశ్రీ, EHS (ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ) JHS (జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్) ల లబ్ధిదారులకు ఉచిత వైద్య సేవలను అందించడంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఆర్థికంగా పెనుభారం మోస్తున్నామని ఆరోగ్యశ్రీ (Aarogyasri) నెట్ వర్క్ ఆసుపత్రులు చాలా వరకు మూసివేయబడే ప్రమాదం పొంచి ఉందని TANHA తెలిపింది. ఈ సంవత్సరం జనవరిలో, TANHA సభ్యులు ఇలాగే నిరసన తెలుపగా రాష్ట్ర ప్రభుత్వం వారి డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. అయితే, ఎనిమిది నెలలు గడుస్తున్నా.. అనేక సమావేశాలు జరిగినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదు.
TANHA యొక్క కొన్ని ప్రధాన డిమాండ్‌లు చేస్తోంది. సభ్య ఆసుపత్రులతో అవగాహన ఒప్పందాలను (నిబంధనలు షరతులు) తిరిగి రూపొందించడం, ప్యాకేజీల సవరణ, సాధారణ చెల్లింపులు, పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం, ఎటువంటి ఆందోళన లేదా పరిశీలన లేకుండా ఏకపక్షంగా సర్క్యులర్‌లను జా...




