IPS Transfers | రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు..
IPS Transfers : తెలంగాణలో మళ్లీ భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. తాజాగా 21 మంది ఐపీఎస్‌లకు స్థాన చలనం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డీఐజీలు ట్రాన్ ఫర్ అయ్యారు. అదనపు డీజీ (పర్సనల్)గా అనిల్ కుమార్, ఎస్పీఎఫ్ డైరెక్టర్‌గా అనిల్ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
IPS Transfers : రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్ ఫర్ అయిన వారి జాబితా
సీఐడీ ఐజీగా ఎం శ్రీనివాసులు,
రామగుండం సీపీగా అంబర్ కిశోర్ ఝా,
వరంగల్ సీపీగా సన్‌ప్రీత్ సింగ్,
ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధూశర్మ,
మహిళా భద్రత విభాగం ఎస్పీగా చేతన,
నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేశ్,
కామారెడ్డి ఎస్పీగా రాజేశ్ చంద్ర,
నిజామాబాద్ సీపీగా సాయిచైతన్య,
సంగారెడ్డి ఎస్పీగా పారితోష్ పంకజ్,
కరీంనగర్ ఎస్పీగా గౌస్ ఆలం...




