Sarkar Live

State

Mamnoor airport | మామునూర్ ఎయిర్‌పోర్టుకు భూ సేక‌ర‌ణ‌… రైతుల నుంచి నిర‌స‌న‌
State

Mamnoor airport | మామునూర్ ఎయిర్‌పోర్టుకు భూ సేక‌ర‌ణ‌… రైతుల నుంచి నిర‌స‌న‌

Mamnoor airport : తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా మామునూర్ విమానాశ్రయం (Mamnoor airport) కోసం భూసేకరణ సర్వే (land acquisition survey) చేపట్టడంపై స్థానిక రైతులు తీవ్ర నిర‌స‌న వ్యక్తం చేస్తున్నారు. ఈ విమానాశ్రయానికి కేంద్రం అనుమతి ఇచ్చిన కొన్ని రోజులకే రాష్ట్ర ప్ర‌భుత్వం సర్వే ప్రారంభించింది. దీంతో భూములు కోల్పోతున్న రైతులు (farmers) ఈ రోజు ఆందోళ‌న‌కు దిగారు. నక్కాలపల్లి రోడ్డుపై నిర‌స‌నను ప్ర‌ద‌ర్శించారు. త‌మ‌కు కేంద్ర ప్ర‌భుత్వం న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని భావించిన పోలీసులు అక్కడ గ‌ట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. రైతుల నిర‌స‌న ఎందుకు ? మామునూర్ ప్రాంతంలో ఒక ఎకరం భూమి కనీసం రూ. 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు విలువ చేస్తుందని, ప్రభుత్వం తగిన పరిహారం అందించాల‌ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప‌రిహారం విష‌యంలో ప్ర‌భుత్వం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అధి...
PM Modi at Vantara | క్రూర జంతువుల‌తో మోదీ.. స్వ‌యంగా ఆహారం పెట్టిన ప్ర‌ధాని
State

PM Modi at Vantara | క్రూర జంతువుల‌తో మోదీ.. స్వ‌యంగా ఆహారం పెట్టిన ప్ర‌ధాని

PM Modi at Vantara : గుజరాత్‌లోని వంతారా (Vantara) వద్ద ఒక విశిష్టమైన వన్యప్రాణి రక్షణ, పునరావాసం & సంరక్షణ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ప్రారంభించారు. విభిన్న జాతుల వన్యప్రాణులకు ఆశ్రయం క‌ల్పించేందుకు ఈ కేంద్రాన్ని (wildlife rescue, rehabilitation, and conservation centre) ఏర్పాటు చేశారు. ఇందులో పునరావాసం పొందిన జంతువులను మోదీ దగ్గరగా పరిశీలించారు. వాటికి అందుతున్న సేవ‌లు, సంర‌క్ష‌ణ‌పై ఆరా తీశారు. వ‌న్య‌ప్రాణుల వైద్య సేవ‌ల‌ను ప‌రిశీలించిన మోదీ ఈ సందర్భంగా వన్యప్రాణి ఆస్ప‌త్రి (wildlife hospital)ని కూడా ప్ర‌ధాని మోదీ సంద‌ర్శించారు. అక్క‌డ అందుబాటులో ఉన్న వైద్య సేవ‌ల‌ను ప‌రిశీలించారు. ఈ ఆస్పత్రిలో వ‌న్య‌ప్రాణుల‌కు MRI, CT స్కాన్లు, ఇతర ఆధునిక వైద్య పరికరాలతోపాటు ఐసీయూలు, అనస్తీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, అంతర్గత వైద్యం ...
Metro Stations Skywalks | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక అన్ని మెట్రో స్టేషన్లలో స్కైవాక్‌లు
State

Metro Stations Skywalks | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక అన్ని మెట్రో స్టేషన్లలో స్కైవాక్‌లు

Metro Stations Skywalks | హైద‌రాబాద్‌ మెట్రో స్టేషన్ల నుంచి సమీపంలోని వాణిజ్య, నివాస భవనాల సముదాయాలకు స్కైవాక్‌లను నిర్మించేందుకు మెట్రో అధికారులు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఈ విష‌యాన్ని కాంప్రెహెన్సివ్‌ మొబిలిటీ ప్రణాళిక (CMP) సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. స్కైవాక్‌లు హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ సమస్యకు కొంతవరకు పరిష్కారం చూప‌నున్నాయి. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే విధంగా ప్రజారవాణా వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడానికి స్కైవాక్‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని భావిస్తున్నారు. Metro Stations Skywalks : ఎక్క‌డెక్కడ‌ నిర్మిస్తున్నారు.? ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ప్రతి మెట్రో స్టేషన్‌ (Hyd Metro)లో సమీపంలోని వాణిజ్య లేదా నివాస సముదాయానికి అనుసంధానిచేలా స్కైవాక్ ఉంటుందని, దీని ద్వారా ప్రజలు ప్రధాన రహదారులను సురక్షితంగా దాటడానికి వీలు కల్పిస్తుందని HMRL, MD, ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు. ఈ ప్రయత్నాల...
MLC Election Result : ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు వీరిదే..
State

MLC Election Result : ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు వీరిదే..

MLC Election Result : కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బిజెపి బలపరిచిన అభ్యర్థి ఘన మల్క కొమురయ్య (Malka Komuraiah) విజయం సాధించారు. ఇక నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఈ విజయం ఆయనను వరించింది. మరోవైపు వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. కాగా గత నెల 27వ తేదీన తెలంగాణలోని మూడు ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే..ఆ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. వాటిలో ఒకటి వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఇక రెండోది ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి. అదే విధంగా.. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల స్థానానికి సంబంధించిన ఎమ్మెల్సీ కౌంటింగ్ క...
Harish Rao | ఇకనైనా బుద్ధి తెచ్చుకో..
State

Harish Rao | ఇకనైనా బుద్ధి తెచ్చుకో..

మ‌రోమారు సీఎం రేవంత్ రెడ్డికి స‌వాల్ విసిరిన హ‌రీష్ రావు.. MLA Harish Rao Fire on CM Revanth | మోకాలికి బోడి గుండుకు ముడివేసి మోసగించడం, తన వైఫల్యం నుంచి దృష్టి మళ్లించడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారింద‌ని బిఆర్ఎస్ నేత‌, మాజీ మంత్రి హ‌రీష్ రావు (Harish Rao) అన్నారు. కర్తవ్యం మరిచి ఎన్నికలలో రాజకీయాలలో మునిగితేలిన ముఖ్యమంత్రి. నేను నా సన్నిహిత మిత్రుడు దుబ్బాక శాసనసభ్యులు కూతురు పెళ్లి ఫంక్షన్ కోసం అబుదాబి వెళితే దాన్ని వివాదం చేయడానికి ప్రయత్నించడం ఆయ‌న నీచత్వానికి పరాకాష్ట అని మండిప‌డ్డారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్య‌ల‌పై హ‌రీస్ రావు ఫైర్ అయ్యారు. ఈమేర‌కు సోమ‌వారం ఆయ‌న ఎక్స్ (X) వేదిక‌గా స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఆయ‌న‌, ప్రమాద స్థలానికి వెంటనే వెళ్ళవలసింది ఆయ‌నే.. తను బాధ్యత మరిచి ఎలక్షన్ ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు...
error: Content is protected !!