Begumpet Airport | గుడ్ న్యూస్.. ఇక బేగంపేట ఎయిర్ పోర్ట్ కు మహర్దశ..
Begumpet Airport : హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి మహర్దశ పట్టనుంది. ఇక్కడి నుంచి వాణిజ్య ప్రయాణాల (commercial flights)ను మళ్లీ ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. బేగంపేట ఎయిర్‌పోర్టు (Begumpet Airport)ను పునరుద్ధరించే అంశంపై కేంద్ర పౌర విమానయాన మంత్రి కె.రామ్మోహన్ నాయుడు (Union civil aviation minister K Ram Mohan Naidu) సంకేతాలు ఇచ్చారు. ఈ ఎయిర్‌పోర్ట్ ప్రస్తుతం భారత వైమానిక దళానికి సంబంధించిన కార్యకలాపాలకు మాత్రమే పరిమితమైంది. ఈ క్రమంలో ఇక్కడి నుంచి మరోసారి సామాన్య ప్రజలకు వాణిజ్య విమాన సౌకర్యాలను అందుబాటులోకి తేవాలని కేంద్రం ప్రణాళికలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
బేగంపేట విమానాశ్రయం చరిత్ర
Begumpet Airport History : బేగంపేట విమానాశ్రయం 1930లో నిర్మితమైంది. నిజాం పాలనలో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి వ్యాపార విమానయానంతో...




