Most Beautiful Handwriting |ప్రపంచంలోనే అత్యంత అందమైన చేతిరాత
Prakriti Malla World's Most Beautiful Handwriting : జీవితాన్ని అందంగా తీర్చిదిద్దడానికి విద్య ఒక సాధనం. చేతిరాతకు, చదువుకు మధ్య లోతైన సంబంధం ఉంది. విద్యలో చేతిరాత ఒక ముఖ్యమైన అంశమనేంది కూడా నిజమే.. మంచి చేతిరాత గల విద్యార్థులు తమ జీవితాల్లో పురోగతి సాధిస్తారని చెబుతారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల మంచి చేతిరాతను అభినందిస్తుంటారు. ఎందుకంటే ఇది ఒక రకమైన ప్రతిభ.. అందరికీ అందమైన హాండ్ రైటింగ్ రాదు.. మంచి చేతి రాతకోసం మీరు ప్రతిరోజూ సాధన చేయాలి. అందువల్ల, మీరు మీ పిల్లలను ప్రతిరోజూ 15-20 నిమిషాలు చేతిరాతను సాధన చేయమని చెప్పాలి. ప్రతీరోజు పిల్లలు సాధన చేయడం వల్ల చేతిరాతలో కచ్చితనమైన మార్పు వస్తుంది.
నేపాల్ (Nepal) కు చెందిన ప్రకృతి మల్లా (Prakriti Malla ) తన చేతిరాతతో అందరి హృదయాలను గెలుచుకుంది. ఆమె అసాధారణ చేతిరాత ఆమెకు "ప్రపంచంలోని అత్యంత అందమైన చేతిరాత" అనే బిరుదును సంపా...



