Cyber Crime : సైబర్ నేరగాళ్లు (Cyber criminals) అమయాకులను తమ ఉచ్చులో బిగించేందుకు రకరకాల పద్ధతులు పాటిస్తున్నారు. అనేక మార్గాల ద్వారా మోసం (Cyber Crime) చేసి డబ్బులు దండుకుంటున్నారు. సామాన్యులనే కాకుండా ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులను సైతం టార్గెట్ చేయడం కలవర పెడుతోంది. తాజాగా ఓ ఎమ్మెల్యేపై కూడా సైబర్ ఎటాక్ జరగడం కలకలం రేపింది. న్యూడ్ వీడియోలు పంపిన క్రిమినల్స్ ఆయన్ను బెదిరించి (blackmail) డబ్బులు దండుకోవడానికి యత్నించారు.
సైబర్ ఎటాక్ బారిన పడ్డ ఎమ్మెల్యే ఎవరు?
తెలంగాణ (Telangana)లోని నల్లగొండ జిల్లా నక్రేకల్ (Nakrekal ) ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని (MLA Vemula Veeresham) టార్గెట్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఆయన సెల్‌ఫోన్ నెంబర్‌ను తెలుసుకొని అశ్లీల వీడియో కాల్ చేశారు. ఒక వ్యక్తి నగ్నంగా కనిపించేలా చేసి కాల్ లిఫ్ట్ చేయగానే స్క్రీన్ రికార్డు చేశారు. ఆ తర్వాత వాట్సాప్ ద్వారా బెదిరింపులు మొదలుపెట్టారు. మీ వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తాం. డబ్బు పంపించకపోతే మీ పరువు పోతుంది అంటూ బ్లాక్ మెయిల్ చేశారు. అప్రమత్తమైన ఎమ్మెల్యే వీరేశం వెంటనే కాల్ కట్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సైబర్ నేరగాళ్ల ఆచూకీని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
Cyber Crime : సైబర్ నేరగాళ్ల రకరకాల ఎత్తుగడలు
సైబర్ నేరాలు వివిధ రూపాల్లో ఉంటున్నాయి. ముఖ్యంగా ఈ క్రిమినల్స్ (Cyber criminals) ఫోన్ హ్యాకింగ్ చేసి వ్యక్తిగత ఫొటోలు, సమాచారం తస్కరించడం, సన్నిహితుల పేరుతో సోషల్ మీడియా (social media)లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం, నకలీ నంబర్ల నుంచి కాల్ చేసి మీ దగ్గరి వ్యక్తుల నంబర్ కనిపించేలా స్పూఫింగ్ చేయడం లాంటి నేరాలకు పాల్పడుతున్నారు. ఇదే క్రమంలో ఇటీవల వీడియో కాల్స్ ద్వారా బ్లాక్ మెయిల్ చేసే ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాము టార్గెట్ చేసుకున్న వ్యక్తికి సైబర్ నేరగాళ్లుఉ హఠాత్తుగా వీడియో కాల్ చేస్తారు. కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే స్క్రీన్‌పై నగ్నంగా ఉన్న వ్యక్తి వీడియో ప్రత్యక్షమవుతుంది. నేరగాళ్లు ఈ స్క్రీన్‌ను రికార్డ్ చేసి, బాధితుడిని బ్లాక్మెయిల్ చేస్తారు. ఈ తరహా నేరాలు ఇటీవల ఎక్కువయ్యాయి. దీనిపై అప్రమత్తత అవసరమని అంటున్నారు పోలీసులు. ఇలాంటి మోసాలు ఏవీ జరిగినా ఏమాత్రం ఆలస్యం చేయండా తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..