హుటాహుటిన ముంబైకి మళ్లింపు.. ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్!
హైదరాబాద్ | కువైట్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఇండిగో విమానంలో ‘మానవబాంబు’ బెదిరింపు (Indigo Bomb Threat) కలకలం సృష్టించింది. ఈ తెల్లవారుజామున ఈమెయిల్ ద్వారా హెచ్చరిక అందడంతో, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ విమానాన్ని అత్యవసరంగా ముంబైకి దారి మళ్లించారు.
Bomb Threat : ప్రమాద హెచ్చరిక ఎలా వచ్చింది?
కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఈరోజు వేకువజామున 1:20 నిమిషాలకు బయలుదేరిన ఈ ఇండిగో విమానం (Flight) ఉదయం 7:42 నిమిషాలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే, విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. “విమానంలో మానవబాంబు ఉంది, దీన్ని పేల్చివేస్తాం” అంటూ దిల్లీ విమానాశ్రయానికి ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి..
ముంబైలో కట్టుదిట్టమైన భద్రత
ఈమెయిల్‌ను తీవ్రంగా పరిగణించిన అధికారులు వెంటనే అప్రమత్తమై, విమానాన్ని హైదరాబాద్‌కు బదులుగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు దారి మళ్లించారు. విమానం చేరుకునే లోపే ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక భద్రతా బృందాలు (Special Security Teams), క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను (QRT) మోహరింపజేశారు. విమానంలో ఉన్న ప్రయాణికుల సంఖ్య, ఈ ఘటనపై ఇండిగో సంస్థ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
GPS స్పూఫింగ్ నేపథ్యంలో ప్రాధాన్యత ఇటీవల దేశంలోని ప్రధాన విమానాశ్రయాలైన దిల్లీ, కోల్‌కతా, ముంబై, శంషాబాద్, బెంగళూరు, చెన్నైలలో జీపీఎస్ స్పూఫింగ్ (GPS Spoofing) వంటి సంఘటనలు నమోదయ్యాయి. ఈ క్రమంలో, ఈ మానవబాంబు బెదిరింపు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భద్రతా సిబ్బంది విమానం ల్యాండ్ అయిన వెంటనే తనిఖీలు చేపట్టనున్నారు.







