మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi)సినీ కెరీర్ లోనే నెంబర్ వన్ చిత్రంగా నిలిచిపోయిన మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి ( Jagadeka Veerudu Athiloka Sundari). అతిలోక సుందరి శ్రీదేవి(sridevi)హీరోయిన్ గా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(raghavendra rao) డైరెక్షన్లో వైజయంతి బ్యానర్ పై అశ్వినీదత్ (ashvinidath)నిర్మించిన ఈ మూవీ 1990 మే 9న రిలీజ్ అయి చరిత్ర సృష్టించింది. సినిమా రిలీజ్ కి ముందు చాలా మందికి ఇది సరిగ్గా ఆడుతుందో లేదో అనే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాకు ముందు దర్శకేంద్రుడు డైరెక్ట్ చేసిన మూవీస్ కొన్ని వరుసగా ప్లాప్ లు అవ్వడమే.ఇక అందరూ దర్శకేంద్రుడి పని అయిపోయిందన్నారట.
మెగాస్టార్ చిరంజీవితో మూవీ అనౌన్స్ అయ్యాక మరో ఫ్లాఫ్ ఖాయమని అనుకున్నారు. కానీ దర్శకేంద్రుడు మాత్రం ఛాలెంజ్ తో ఈ మూవీని టేకప్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా అంత పెద్ద డైరెక్టర్ ఫ్లాప్ లో ఉన్నాడనే డౌట్ లేకుండా డైరెక్టర్ స్టామినా ఏంటో తనకు తెలుసు కాబట్టి ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎప్పటినుంచో ఒక సోషియో ఫాంటసీ మూవీ తీయాలని దత్తుకి, డైరెక్టర్ కి ఉండేదట. దీంతో ఈ స్టోరీ రెడీ అయింది. ఇక గ్రాండ్ గా ఈ మూవీ షూటింగ్ మొదలెట్టారు.
మెగాస్టార్ కి హై ఫీవర్ అయినా డాన్స్..
ఒకపక్క ఇళయరాజా (Ilayaraja)బాణీలు చకచకా ఇచ్చేస్తున్నారు. సాఫీగా షూటింగ్ జరుగుతుండగా అతిలోక సుందరి శ్రీదేవికి తెల్లారితే బాంబేలో వేరే సినిమా షూటింగ్.వెళ్లిందంటే రెండు మూడు నెలలు ఆ మూవీ షూటింగ్ లో నే ఉంటుంది. ఇంకా దినక్కుత అనే పాటను కంప్లీట్ చేయాల్సి ఉందట. కానీ ఆరోజు మెగాస్టార్ కి 104 హై ఫీవర్ ఉండడంతో ఆ సాంగ్ కంప్లీట్ అవ్వడం ఇంపాజిబుల్ గా మారింది. కానీ అక్కడుంది మెగాస్టార్ కాబట్టే ఫీవర్ ని కూడా లెక్కచేయకుండా సెట్స్ లో డాక్టర్లను పెట్టుకొని ఒక్కొక్క స్టెప్పు అదిరిపోయేలా వేశారు. ఇక ఆఖరి స్టెప్ అయిపోయాక డైరెక్టర్ కట్ అని చెప్పాక మెగాస్టార్ అక్కడే కళ్ళు తిరిగి పడిపోయారట. ఒక మూడు రోజులు తనకు ఏం జరిగిందో కూడా తెలియలేదని ఒక ఇంటర్వూ లో మెగాస్టార్ చెప్పుకొచ్చారు.
జంధ్యాల (jandhyala)మాటలు, వేటూరి(veturi)పాటలు, ఇళయరాజా బాణీలు, దర్శకేంద్రుడి మాయాజాలం, చిరంజీవి గ్రేస్, అతిలోకసుందరి అందం.. ఈ సినిమాను ఒక ప్రభంజనం సృష్టించేలా చేశాయి. ఇక ఈ సినిమా రిలీజ్ రోజు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం బీభత్సమైన వర్షాలు, తుఫానులు. అయినా కానీ అక్కడ చిరంజీవి సినిమా కాబట్టి ఒకపక్క టాక్ అదిరిపో తోంది కాబట్టి థియేటర్లలోకి నీళ్లు వచ్చిన కానీ సీట్లపైన కాళ్లు పెట్టుకొని మరి ఆ సినిమాను చూశారంటే ఎంతటి చరిత్ర సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు.
తుఫాన్ ని లెక్కచేయని సినిమా..
తుఫాన్ ను కూడా లెక్కచేయకుండా కలెక్షన్ల సునామి సృష్టించిన ఈ మూవీని 35 ఏళ్ల తర్వాత అదే రిలీజ్ డేట్ రోజు రీ రిలీజ్ చేయడం అనేది విశేషం. ఇప్పటికే బుక్ మై షో లో 6000 టికెట్లకు పైగా అమ్ముడుపోయాయి. మెగాస్టార్ కటౌట్ లు కట్టి ఈ సినిమాపై ఉన్న ఇష్టాన్ని చాటుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ మూవీ రీ రిలీజ్ రోజే శ్రీ విష్ణు, సమంత మూవీలు కూడా రిలీజ్ కానున్నాయి.కానీ ఈ మూవీ నే ట్రెండింగ్ లో ఉంది. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, ప్రొడ్యూసర్ అశ్వినీదత్ రంగంలోకి దిగి ప్రమోషన్స్ చేస్తున్నారు.
లేటెస్ట్ గా దానికి సంబంధించిన ఇంటర్వ్యూ కూడా చేశారు. దీనికి పార్ట్ 2 (Jagadeka Veerudu Athiloka Sundari 2) కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. ఏమైనా త్రీడీలోకి మారి సినిమాను రిలీజ్ చేస్తున్న చిత్ర బృందం ఫ్యాన్స్ కి మళ్ళీ ఒక మరిచిపోలేని అనుభూతిని ఇస్తున్నారు. మళ్లీ థియేటర్లలో అబ్బనీ తీయని దెబ్బ సాంగ్ లో చిరంజీవి గ్రేస్ ని, అందాలలో అహో మహోదయం అనుకుంటూ అతిలోక సుందరి నాట్యాన్ని, దినక్కుతా అనే పాటలో శ్రీదేవి, చిరంజీవి మెస్మరైజ్ ని, జై చిరంజీవ పాటలో సంజీవిని తేవడానికి చిరంజీవి కష్టాన్ని, నేనే రాజు అనే పాటలో చిరు రాజసాన్ని, అంబ్రిష్పురి,రామిరెడ్డి,కన్నడ ప్రభాకర్ విలనిజాన్ని, అల్లు రామలింగయ్య కామెడీని, అంగుళికం పొందడానికి శ్రీదేవి తంటాలను,పిల్లలు చేసే అల్లరిని, వాళ్లతో చిరు ఎమోషన్స్‌ని మళ్లీ మనం వెండితెరపై చూడొచ్చు. 35 సంవత్సరాల తర్వాత రీ రిలీజ్ అవుతున్న ఈ మూవీ మళ్లీ ఎంత ప్రభజనం సృష్టిస్తుందో చూద్దాం
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.