Sarkar Live

Kannappa Review | విశ్వాసం, త్యాగం, భక్తితో విరాజిల్లిన విజువల్ విందు!

మంచు విష్ణు (Manchu Vishnu)డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప(Kannappa). ఎన్నో సంవత్సరాలు ఈ స్క్రిప్ట్ పై పనిచేసి భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. హిందీలో మహాభారతం సీరియల్ ను డైరెక్ట్ చేసిన ముకేష్ కుమార్(Mukesh Kumar)డైరెక్షన్ వహించగా మంచు మోహన్ బాబు(Mohan Babu)

Kannappa Review

మంచు విష్ణు (Manchu Vishnu)డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప(Kannappa). ఎన్నో సంవత్సరాలు ఈ స్క్రిప్ట్ పై పనిచేసి భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. హిందీలో మహాభారతం సీరియల్ ను డైరెక్ట్ చేసిన ముకేష్ కుమార్(Mukesh Kumar)డైరెక్షన్ వహించగా మంచు మోహన్ బాబు(Mohan Babu) నిర్మించారు. భారీ అంచనాలతో రిలీజ్ కి రెడీ అయిన ఈ మూవీ చాలా సార్లు వాయిదా పడింది. ఫైనల్ గా ఈరోజు థియేటర్ లలో రిలీజ్ అయి ఎలాంటి టాక్ తెచ్చుకుందో చూద్దాం…..

Kannappa Movie : స్టోరీ…

ఒక గూడేనికి చెందిన నాయకుడు (శరత్ కుమార్) కొడుకు తిన్నడి(విష్ణు)కి శివుడంటే అస్సలు ఇష్టం ఉండదు.కానీ తిన్నడి ప్రేమికురాలు నెమలి (ప్రీతి ముకుందన్) మాత్రం శివుడిని ఆరాధిస్తుంది.ఒక విషయంలో కొందరి రాక్షసుల నుండి ఆ గూడేనికి ఆపద తలెత్తుతుంది. అసలు ఆ ఆపద ఏంటి..? దాని నుండి తిన్నడు ఆ గూడెన్ని కాపాడాడ..?శివుడిని ద్వేషించే తిన్నడు భక్తుడిగా ఎలా మారాడు అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే…..

మూవీ ఎలా ఉందంటే…?

Kannappa Review : మూవీ చిత్రీకరణ జరిగినన్ని రోజులు నెగిటివ్ టాక్ తో ఉన్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక మొత్తం గ్రాఫే మారిపోయింది. ట్రైలర్ తో ట్రోలర్స్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది మూవీ టీం. సీరియల్ తీసే డైరెక్టర్ ని తీసుకొచ్చి భారీ ప్రాజెక్ట్ ని అప్పగించారేంటీ అనుకున్నవాళ్లకి బ్లాక్ బస్టర్ హిట్టు ఇచ్చేలా ఉన్నాడే అనిపించింది. అలా ట్రైలర్ తో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసుకుని రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ లో వచ్చే సీన్స్ సాగదీసినట్టుగా అనిపించింది. ఎక్కడ కూడా ఆడియన్స్ క్లాప్స్ కొట్టేలా, విజిల్స్ వేసేలా సీన్స్ రాసుకోక పోవడం మైనస్ అని చెప్పొచ్చు. హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ సీన్స్ కూడా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఫస్ట్ ఆఫ్ మొత్తం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది. ప్రభాస్ సెకండాఫ్ లో వస్తాడని ముందే చెప్పారు కాబట్టి ఆ ఎపిసోడ్ కోసం వెయిట్ చేసేలా ఉందని చెప్పొచ్చు. మూవీ మొత్తం సెకండాఫ్ లో ఇరగదీస్తుందనే ఆశతో ఫస్ట్ ఆఫ్ లాగించేశారు. ఇక సెకండాఫ్ స్టార్ట్ అయ్యాక కూడా ఆడియన్స్ నిరాశతోనే ఉంటాడు. కానీ రుద్ర పాత్ర ప్రేక్షకుడిని నిద్ర లేపుతుంది. ఆ పాత్ర కూడా అంతలా లేకపోయినా ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ తో అందరినీ తన వైపు తిప్పుకుని మూవీని తన భుజాలపై వేసుకుంటాడు. ఈ మూవీ ఇలా ఉందంటీ డిజాస్టర్ ఖాయం అనుకున్న ప్రేక్షకుడు రుద్ర వచ్చాక లెక్కలు మారిపోతాయి. ఇలా ఉండాలి బ్లాక్ బస్టర్ ఖాయం అనుకునేలా ఆడియన్స్ ను కట్టిపడేసారు. విష్ణు నట విశ్వరూపం కూడా సెకండాఫ్ లోనే చూస్తాం. ఎమోషనల్ సీన్స్ లో ఆడియన్స్ తో కంట తడి పెట్టేస్తాడు. క్లైమాక్స్ విషయానికి వస్తె విష్ణు మూవీస్ లో ది బెస్ట్ క్లైమాక్స్ అని చెప్పొచ్చు. తన కెరియర్ లో గుర్తుండిపోయే మూవీగా నిలిచిపోతుంది.

*నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు…

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa) ను ఎంత మనస్సు పెట్టి చేశాడో ఆయన నటనే చెబుతుంది. కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసాడు. క్లైమాక్స్ లో విష్ణు నటన సూపర్ అని చెప్పొచ్చు. హీరోయిన్ ప్రీతి ముకుందన్ ఆకట్టుకుంది. ఇంకాస్త ఆమె పాత్రను సరిగా ప్రజెంట్ చేస్తే బాగుండేది. ప్రభాస్ రుద్ర గా యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోల్ తనే చేయగలడు అనిపించాడు. మోహన్ బాబు యాక్టింగ్ తో ఆయన పాత్రకు ప్రాణం పోశాడు అని చెప్పొచ్చు. అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ లాల్ వారి పాత్రల్లో అదరగొట్టేసారు. మిగిలిన నటీనటులు వారి వారి పాత్రల మేరకు బాగానే నటించారు. ఇక కెప్టెన్ ఆఫ్ ది షిప్ మహాభారతం సీరియల్ లో కొన్ని ఎపిసోడ్స్ డైరెక్ట్ చేసిన ముకేష్ కుమార్ ఈ మూవీకి డైరెక్టర్ అని తెలియడంతో ఆడియన్స్ కి ఆయనపై అంతగా నమ్మకం లేదు. కానీ ఈ మూవీతో ఈ ప్రాజెక్ట్ కి తనే కరెక్ట్ అనిపిస్తుంది. అందరి బడా స్టార్స్ ని హ్యాండిల్ చేసి సూపర్ గా తెరకెక్కించాడు. ఫస్ట్ ఆఫ్ మీద ఇంకాస్త దృష్టి పెడితే డైరెక్టర్ పేరు మారుమోగిపోయేది. స్టీఫెన్ దేవాసి మ్యూజిక్ ఒకే అనిపించింది. పాటలు అంతగా ఆకట్టుకోకున్న బీజీఎం తో అదరగొట్టాడు. కొన్ని సీన్స్ తన బిజీఎం తోనే ఎలివేట్ అయ్యాయని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే తో విష్ణు ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి.ఓవరాల్ గా కన్నప్ప ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు.

ప్లస్ పాయింట్స్…

  • విష్ణు, ప్రభాస్ యాక్టింగ్
  • బీజీఎం
  • క్లైమాక్స్

మైనస్ పాయింట్స్…

  • ఫస్ట్ ఆఫ్
  • లవ్ సీన్స్
  • సాంగ్స్

మూవీ రేటింగ్

3.5/5


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!