Kasibugga temple stampede | శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనతో తీవ్ర విషాదం అలుముకుంది. శనివారం ఉదయం సుమారు 11.45 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను సమీపంలోని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని టెక్కలిలోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో ఏడుగురు మరణించగా, హాస్పటల్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరు తర్వాత మరణించినట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదానికి కారణాలేంటి?
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆలయంలోని రెయిలింగ్ ఒక్కసారిగా విరిగిపడటంతో తొక్కిసలాట జరిగిందని అధికారులు వెల్లడంచారు. ఒక్కసారిగా పెద్దఎత్తున భక్తులు క్యూలోకి రావడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
అనుమతుల్లేకుండా ఏర్పాట్లు
ఈ ఘటనపై ఏపీ సర్కారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ప్రైవేఉ ఆలయం కావడంతో ఎలాంటి అధికారిక అనుమతులు తీసుకోకుండానే ఏకాదశి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారని అధికారులు తెలిపారు. భక్తులు భారీ సంఖ్యలో వస్తారని ముందే ఊహించినా కూడా అందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదని చెబుతున్నారు.
ఈ ఘనటపై ప్రభుత్వం వెంటనే వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేసింది. నిర్లక్ష్యం, నిర్వాహక లోపాలు బయటపెట్టేలా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ మొదలుపెట్టారు.
ఎంట్రీ, ఎగ్జిట్ ఒకే మార్గం
భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి వచ్చినా కూడా, నిర్వాహకులు ఎంట్రీ, ఎగ్జిట్ కోసం ఒకే క్యూలైన్ ఏర్పాటు చేశారు. అదే సమయంలో ఆలయంలో నిర్మాణ పనులు కొనసాగుతుండటం ప్రమాదానికి కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. నిర్మాణ పనుల ప్రాంతంలోనే తొక్కిసలాట జరగడంతో పరిస్థితి అదుపులో తప్పింది. భక్తుల రాకపోకలకు ముందస్తుగా వేర్వేరు మార్గాలు ఏర్పాఉ చేసి ఉంటే, ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదనిస్థానికులు పేర్కొంటున్నారు.
వలంటీర్ల కొరత
ఆలయ నిర్వాహకులు కేవలం 3 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. కానీ వాస్తవానికి సుమారు 25 వేల మంది వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ భారీ రద్దీని ఎదుర్కొనేంత వాలంటీర్లు, భద్రతా ఏర్పాట్లు లేకపోవడం పరిస్థితిని మరింత జఠిలం చేసింది. ప్రజల భద్రతకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని బాధితుల కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








