Sarkar Live

Mehul Choksi | వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ.. అరెస్టు..

Mehul Choksi : వేల కోట్ల బ్యాంకు కుంబ‌కోణంలో నిందితుడైన వ‌జ్రాల వ్యాపారి (Absconding diamond jeweller) మెహుల్ చోక్సీ (Mehul Choksi detained) ఎట్ట‌కేల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. బెల్జియం (Belgium)లోని యాంట్వెర్స్ న‌గ‌రంలో అత‌డిని అరెస్టు చేసిన‌ట్టు అక్క‌డి అధికారిక వ‌ర్గాలు

Mehul Choksi

Mehul Choksi : వేల కోట్ల బ్యాంకు కుంబ‌కోణంలో నిందితుడైన వ‌జ్రాల వ్యాపారి (Absconding diamond jeweller) మెహుల్ చోక్సీ (Mehul Choksi detained) ఎట్ట‌కేల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. బెల్జియం (Belgium)లోని యాంట్వెర్స్ న‌గ‌రంలో అత‌డిని అరెస్టు చేసిన‌ట్టు అక్క‌డి అధికారిక వ‌ర్గాలు వెల్ల‌డించాయి. భార‌త్ నుంచి పంపిన ఎక్స్‌ట్రడిషన్ డిమాండ్‌కు స్పంద‌న‌గా ఆ దేశం అత‌డిపై ఈ మేర‌కు చ‌ర్య‌లు తీసుకుంది.

రూ. 13 వేల కోట్ల మోసం

భారత్‌లో చోటుచేసుకున్న పెద్ద కుంబ‌కోణాల్లో లోన్ పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో చోటుచేసుకున్న మోసం కేసు ఒక‌టి. డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీ (Mehul Choksi ) ఇందులో ప్ర‌ధాన నిందితుడు. సుమారు రూ. 13,000 కోట్ల మేర బ్యాంకును మోసం చేసినట్టు అత‌డిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ కేసు క‌ల‌క‌లం రేపింది. 2018లో ఈ కుంబ‌కోణం వెలుగుచూసింది.

బ్యాంకుకు బురిడీ కొట్టించి..

PNB ముంబైలోని బ్రేడీ హౌస్ బ్రాంచ్ ద్వారా అనుమానాస్పద లావాదేవీలు జ‌రిగిన‌ట్టు వెల్ల‌డైంది. ముంబై పీఎన్‌బీ శాఖలో ఫైనాన్షియల్ క్రెడిట్స్, లెటర్ ఆఫ్ అండర్టేకింగ్స్ తప్పు మార్గంలో ఇచ్చినట్టు బ్యాంక్ అధికారులే కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు దశలవారీగా వెలుగులోకి వచ్చింది.
ఈ కేసులో మెహుల్ చోక్సీ (Mehul Choksi detained)తో పాటు అతని మేనల్లుడు, పరారీలో ఉన్నమ‌రో డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ కూడా ముఖ్య‌ పాత్ర పోషించారు. వీరి కుటుంబ సభ్యులు, ఉద్యోగులు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) లోని కొందరు అధికారులు కూడా ఈ మోసంలో పాలుపంచుకున్నారని విచారణ సంస్థలు తేల్చాయి. ఈ కేసు బయట ప‌డిన‌ప్ప‌టి నుంచి నిందితులు విదేశాల్లో దాక్కొని భారత న్యాయ వ్యవస్థ నుంచి తప్పించుకుంటూ తిరుగుతున్నారు.

అరెస్టు వెనుక క‌స‌ర‌త్తు

చోక్సీ బెల్జియం లో అరెస్టు కావడం వెనుక చాలా క‌స‌ర‌త్తు ఉంది. మొదట అతడిపై ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు (Interpol Red Notice) జారీ అయ్యింది. కానీ ఇటీవల కొన్ని కారణాల వల్ల దానిని తొలగించారు. అయితే.. భారతదేశానికి చెందిన రెండు ప్రధాన దర్యాప్తు సంస్థలు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate (ED), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కలిసి అతడి ఎక్స్‌ట్రడిషన్ కోసం బెల్జియం ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో చోక్సీ అరెస్టు సాధ్య‌మైంది.

ప‌ట్టు వీడని దర్యాప్తు సంస్థ‌లు

మెహుల్ చోక్సీపై ఇప్పటికే మూడు చార్జ్‌షీట్‌లు దాఖలయ్యాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై ‘LOUs’ (లెటర్ ఆఫ్ అండర్టేకింగ్)ను జారీ చేయించుకుని, నిబంధనలకు విరుద్ధంగా ‘FLCs’ (ఫారెన్ లెటర్ ఆఫ్ క్రెడిట్)లను పెంపొందించుకొని బ్యాంకును మోసం చేశాడ‌ని ED తన దర్యాప్తులో పేర్కొంది. చోక్సీ మొదటగా భారతదేశం నుంచి పారిపోయాడు. అతను ఆ సమయంలో డొమినికాలో శరణం పొందాడు. అప్పట్లోనే అతను అక్కడి పౌరసత్వం పొందే ప్రయత్నం చేశాడు. కానీ భారత ప్రభుత్వం తరపున దర్యాప్తు సంస్థలు అప్పటి నుంచి అతన్ని భారతదేశానికి తీసుకురావడానికి కృషి చేస్తూనే ఉన్నాయి.

రెడ్ నోటీసును తొలగించడంతో అవరోధం!

చోక్సీపై ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు (Interpol Red Notice)ను తొలగించడమే అతడికి తాత్కాలిక ఊరటనిచ్చింది. కానీ.. భారత అధికారులు తక్షణమే బెల్జియం ప్రభుత్వం వద్ద అధికారికంగా ఎక్స్‌ట్రడిషన్ కోసం అభ్యర్థించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ సమన్వయంతో ఈ ప్రక్రియ నడిచింది. ఈ క్ర‌మంలో న్యాయ వ్యవస్థను అనుసరిస్తూ చోక్సీ అరెస్టు జరిగిందని అధికారులు తెలిపారు.

భార‌త్‌కు తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నాలు

చోక్సీని తిరిగి భారత్‌కు తేవడంపై చర్చలు జరుగుతున్నాయి. బెల్జియం ప్రభుత్వంతో సంబంధిత లీగల్ ఫార్మాలిటీలను పూర్తి చేయాల్సిన ఉంది. అయితే.. చోక్సీ తన అరెస్టును అన్యాయంగా అభివర్ణించేందుకు ప్రయత్నాలు చేసే అవకాశముంది. గతంలో అతడు డొమినికాలో ఇలాగే జడ్జిలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం మరింత గట్టి ఆధారాలు సమర్పించి, అతడిని తప్పించుకోలేని స్థితిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!