ACB Raids | పెండింగ్ బిల్లుల కోసం డబ్బుల డిమాండ్.. పక్కా వ్యూహంతో పట్టుకున్న ఏసీబీ
ACB Raids | ఇటీవల కాలంలో ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తోంది. అదును చూసి పక్కా వ్యూహంతో అవినీతి తిమింగళాలను పట్టుకుంటోంది. తాజాగా ఓ వ్యక్తి నుంచి భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా నీటి పారుదల శాఖ (Irrigation Department)ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)ని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. సదరు అవినీతి అధికారి ఏకంగా రూ. 60,000/- లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే..
రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sirisilla ) నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) గా విధులు నిర్వహిస్తున్న ఎర్రంరెడ్డి అమరేందర్ రెడ్డి జిల్లాలోని ముస్తాబాద్ మండలం ఆవునూరు-అగ్రహారం మధ్యలో నిర్మించిన చెక్ డ్యాం బిల్లుల విడుదల కోసం హన్మకొండకు చెందిన సూరం రవీందర్ అనే కాంట్రాక్టర్ వద్ద రూ.లక్ష లంచం డిమాండ్ చేశాడు. చివరకు బేరం రూ.75 వేలకు కుదిరింది. కరీంనగర్ లోని విద...




