Rajiv Highway : నేషనల్ హైవేగా రాజీవ్ రహదారి?
కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Adilabad News : తెలంగాణ నిత్యం వాహనాల రద్దీతో బిజీగా ఉండే హైదరాబాద్(Hyderabad)-కరీంనగర్ -మంచిర్యాల రాజీవ్ రహదారి ( Rajiv Highway ) ని జాతీయ రహదారిగా మార్చేందుకు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ రహదారిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్వాలిటీ లేకుండా పనులు చేయడంవల్ల ఈ రాజీవ్ రహదారి పూర్తిగా అధ్వానంగా మారిందని తెలిపారు.రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ మేరకు నితిన్ గడ్కరీ (Nitin Gadkari) హామీ కూడా ఇచ్చారని తెలిపారు. అయితే ఆ రోడ్డుకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయని, ఈ నేపథ్యంలో సదరు కాంట్రాక్టర్ తో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని బండి సంజయ్ అన్నారు. ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ...




