PM-KISAN : PM కిసాన్ యోజన తదుపరి విడత ఎప్పుడు వస్తుంది, ఎలా చెక్ చేసుకోవాలి?
PM-KISAN 20th Installment : ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం యొక్క 20వ విడత త్వరలో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు రూ. 2000 సహాయం అందించనున్న విషయం తెలిసిందే.. ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. కానీ ఈ ఇన్‌స్టాల్‌మెంట్ జూన్ 2025 లో వచ్చే అవకాశం ఉంది.
PM-KISAN సమ్మాన్ నిధి యోజన అంటే ఏమిటి?
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-KISAN) అనేది రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకం. దీని కింద అర్హత కలిగిన రైతులకు ఏటా రూ. 6,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ మొత్తాన్ని మూడు సమాన వాయిదాలలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ పథకం రైతులకు విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల వంటి చిన్న వ్యవసాయ అవసరాలకు సహాయం చేస్తూ.. రైతుల ఆదాయానికి స్థిరత్వాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద...




