Rain Alert : మే 7 వరకు ఈ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు..
Telangana Rain Alert : హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న వేళ హైదరాబాద్ వాతావరన విభాగం శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నగరంతోపాటు ఇతర జిల్లాల్లోని ప్రజలు రాబోయే ఐదు రోజులు తీవ్రమైన వేడిగాలుల వంటి పరిస్థితుల నుంచే ఉపశమనం పొందవచ్చని తెలిపారు. మే 7 బుధవారం వరకు తెలంగాణ రాష్ట్రంలోని 29 జిల్లాల్లో విస్తృతంగా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ శుక్రవారం తన అంచనా వేసింది.
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఇందులో ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ తదితర జిల్లాల్లో శనివారం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
అదే రోజు సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి, మహబూ...




