Sarkar Live

Privacy Policy

Job Mela | రేపు ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ మేళా
career

Job Mela | రేపు ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ మేళా

Job Mela 2025 : ఉస్మానియా యూనివర్సిటీ లోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో మిత్రా ఏరిన ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈనెల 22న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు.మిత్రా ఏరిన ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లోని ,(టెక్నీషియన్ & సర్వీస్ అడ్వైజర్ ) 25 పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. డిగ్రీ పూర్తి చేసిన యువతి యువకులకు 18 నుండి 30 సంవత్సరాల వయసు వారికి మాత్రమే ఈ జాబ్ మేళాలో అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ చీఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. రూ.15,000 నుంచి రూ.25,000 వేలవరకు వేతనం అందించ‌నున్నారు. ఈ టెక్నీషియన్ & సర్వీస్ అడ్వైజర్స్ ఉద్యోగాలకు మరిన్ని వివరాలకు HR (Ph.No.7799884996, 7799464344) ను సంప్రదించా...
ED Raids | బొగ్గు మాఫియాపై ED భారీ ఆపరేషన్: రెండు రాష్ట్రాల్లో 40కి పైగా ప్రాంగణాల్లో దాడులు
National

ED Raids | బొగ్గు మాఫియాపై ED భారీ ఆపరేషన్: రెండు రాష్ట్రాల్లో 40కి పైగా ప్రాంగణాల్లో దాడులు

ED Raids in Jharkhand and West Bengal | జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లో ED దాడులు: అక్రమ బొగ్గు తవ్వకాలు, మనీలాండరింగ్ కేసులపై కఠినంగా వ్యవహరిస్తోంది. శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో ఆక‌స్మిక దాడులు ప్రారంభించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ( PMLA ) కింద ఈ ఆప‌రేష‌న్ నిర్వహిస్తున్నారు, రెండు రాష్ట్రాల్లోని 40 కి పైగా ప్రాంగణాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్ బొగ్గు దొంగతనం, అక్రమ రవాణాకు సంబంధించిన ప్రధాన కేసులతో ముడిపడి ఉంది. ఇవి ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించాయి. ED Raids : జార్ఖండ్‌లో 18 చోట్ల దాడులు శుక్రవారం తెల్లవారుజామున ధన్‌బాద్‌లో ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. బొగ్గు వ్యాపారి ఎల్.బి. సింగ్ నివాసం అతని అనుబంధ సంస్థలపై ED ఏకకాలంలో దాడులు నిర్వహించింది. దేవ్ బిల్డా ప్రాంతంతో సహా ధన్‌బాద్‌లోని దాదాపు 18 ప్రదేశాలలో ED బృందాలు చురుగ్...
Visakhapatnam | తాటిచెట్ల‌పాలెం బాలిక మృతి కేసులో ఇంకా వీడని మిస్ట‌రీ
Crime

Visakhapatnam | తాటిచెట్ల‌పాలెం బాలిక మృతి కేసులో ఇంకా వీడని మిస్ట‌రీ

Visakhapatnam | విశాఖపట్నం జిల్లా తాటిచెట్లపాలెంలో ఇటీవ‌ల జరిగిన ఘటన స్థానికులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఒక మైనర్ బాలికను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి, శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి కాలువలో పడేసిన విష‌యం తెలిసిందే.. కాలువలో అనుమానాస్పదంగా శరీర భాగాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని భాగాలను సేకరించి, విశాఖ కేజీహెచ్ ల్యాబ్‌కు పంపించారు. అయితే ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ, 24 గంటలు గడిచినా గుర్తించేలా ఏ ఆధారమూ లభించలేదు. ముఖ్యంగా బాలిక తల భాగం ఇప్పటికీ కనబడకపోవడం విచారణను మరింత క్లిష్టంగా మార్చింది. తాటిచెట్లపాలెం పరిసర ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలు ఇటీవల ప్రసవించిన మహిళల వివరాలను ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు సేకరిస్తున్నారు.పోలీసులు రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు:అక్రమ సంబంధం నేపథ్యంలో పుట్టిన శిశ...
Jadcherla | కెమిక‌ల్ ట్యాంక‌ర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సు
State

Jadcherla | కెమిక‌ల్ ట్యాంక‌ర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సు

Mahabubnagar accident : కొన్నాళ్లుగా రోడ్డు ప్ర‌మాదాలు తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. తాజాగా జడ్చర్ల (Jadcherla) సమీపంలోని మాచారం ఫ్లైఓవర్‌పై గురువారం ఉదయం ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రసాయనంతో వెళ్తున్న ట్యాంకర్‌ను ఢీకొట్టింది, అదృష్ట‌వ‌శాత్తు ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో దాదాపు 26 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీని ఫలితంగా హైడ్రోక్లోరైడ్ యాసిడ్ రోడ్డుపై చిందింది. బస్సు డ్రైవర్ వెంటనే ప్రయాణికులందరినీ దిగమని హెచ్చ‌రించాడు. ఆ రద్దీలో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. యాసిడ్ మండేది కాదని, అందువల్ల ఎటువంటి మంటలు లేవని, పెద్ద ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. అగ్నిమాపక దళాలను రంగంలోకి దించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. NH 44 పై ట్రాఫిక్ స్తంభించిపోయింది. అధిక...
Group-II నియామకాల్లో కీల‌క మలుపు
State, Hyderabad

Group-II నియామకాల్లో కీల‌క మలుపు

Group-II recruitment : గ్రూప్–II నియామకాలపై సంవత్సరాలుగా కొనసాగుతున్న గందరగోళం మ‌ధ్య‌ తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) కీలక తీర్పు వెలువరించింది. రివాల్యుయేషన్ ఫలితాలను, Telangana Public Service Commission (TGPSC) విడుదల చేసిన తుది సెలక్షన్ లిస్టును పూర్తిగా రద్దు చేసింది. దీంతో మరోసారి ప్రభుత్వ నియామకాల్లో పారదర్శకతపై చర్చకు దారితీసింది. అస‌లు వివాదం ఏమిటంటే… గ్రూప్–II నియామకాల ప్రక్రియ‌లో TGPSC పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని పి. ప్రసన్నలత, బొక్కు సుజాత సహా మొత్తం 23 మంది అభ్యర్థులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మార్పులు చేసిన OMR షీట్లను మూల్యాంకనంలో చేర్చార‌ని వారి ప్ర‌ధాన‌ ఆరోప‌ణ‌. దీనివల్ల తుది జాబితా పూర్తి అన్యాయంగా, అసమంజసంగా ఉంద‌ని పేర్కొన్నారు. ఈ అభ్యర్థులు చూపిన ఆధారాలు బలంగా ఉండ‌టంతో వారి వాదనలను కోర్టు అంగీకరించింది. టాంపరింగ్ చేసిన OMR షీట్‌లే అసలు వి...
error: Content is protected !!