SOCIAL WALFAR SCHOOL : గురుకులంలో దారుణం.. విద్యార్థి ఆత్మహత్య!
                    SUICIDE IN GURUKULA SCHOOL వనపర్తి : తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ తో విద్యార్ధులు వరుసగా మృత్యువాత పడుతుంటే.. మరోవైపు మరికొందరు విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతుండడం కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు గురుకులాల్లో వివిధ కారణాలతో 48 మంది విద్యార్థులు మృతి చెందారు. తాజాగా వనపర్తి జిల్లా మదనాపురం ఎస్సీ బాలుర గురుకుల పాఠశాల (SOCIAL WALFAR SCHOOL) లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడో తరగతి విద్యార్థి పట్టపగలే.. వసతి గృహంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్మకు పాల్పడడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనపై స్థానకులు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..
వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొన్నూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు - సత్యమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. కూలి పనులు చేసుకుని శ్రీనివాసులు దంపతులు పిల్లలను ప్రభు...                
                
             
								



