Sarkar Live

Privacy Policy

Bill Clinton | బిల్ క్లింట‌న్‌కు అస్వ‌స్థ‌త‌..
National

Bill Clinton | బిల్ క్లింట‌న్‌కు అస్వ‌స్థ‌త‌..

Bill Clinton Hospitalised | అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. వాషింగ్ట‌న్ డీసీలోని మెడ్‌స్టార్ జార్జ్‌టౌన్ యూనివర్శిటీ హాస్పిటల్ (MedStar Georgetown University Hospital in Washington, D.C.)లో చేర్చారు. ఈ విష‌యాన్ని ఆయన డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆంజెల్ యురీనా వెల్లడించారు. 'మాజీ అధ్య‌క్షుడు క్లింట‌న్ అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చేరారు. ఇప్పుడాయ‌న బాగానే ఉన్నారు. క్రిస్మ‌స్‌కు ముందే ఇంటికి తిరిగి వ‌స్తారు' అన్నారు. ఆయ‌న ప్ర‌స్తుతం వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నార‌ని తెలిపారు. వైద్య బృందం అప్ర‌మ‌త్తంగా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు అవ‌స‌ర‌మైన చికిత్స‌ను అందిస్తోంద‌ని పేర్కొన్నారు. ఒక్క‌సారిగా కుప్ప‌కూలిన Bill Clinton వాషింగ్టన్‌లో తన నివాసంలో ఉన్నప్పుడు 78 ఏళ్ల క్లింటన్ (Former US President Bill Clinton) అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోవ‌డంతో వెంట‌నే ఆయ‌న...
Daaku Maharaaj Chinni Song | క్లాస్‌ను.. మాస్ ను ఆకట్టుకుంటున్న చిన్నీ పాట‌
Cinema

Daaku Maharaaj Chinni Song | క్లాస్‌ను.. మాస్ ను ఆకట్టుకుంటున్న చిన్నీ పాట‌

Daaku Maharaaj Chinni Song | తమన్, అనంత శ్రీరామ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌, సినీ గేయ ర‌చ‌యిత‌ల నుంచి వచ్చిన లేటెస్ట్ సాంగ్ ‘చిన్ని’ అనే టైటిల్‌తో వచ్చిన సాంగ్ యూట్యూబ్ లో ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. సింగర్ విశాల్ మిశ్రా అద్భుతంగా ఆల‌పించిన‌ ఈ పాట.. బాలకృష్ణ (Nandamuri Balakrishna)పాత్ర, ఒక చిన్నారి ప్రధాన పాత్ర మధ్య ఉన్న అపురూప‌మైన బంధాన్ని ప్రతిబింబిస్తుంది. హిల్ స్టేషన్‌లోని సుందరమైన ప్రదేశాల మధ్య చిత్రీకరించబడిన ఈ పాట మ‌న‌స్సుల‌ను హ‌త్తుకుంటోంది. ఇటు క్లాస్‌, అటు మాస్ ఆడియన్స్‌ని అలరించేలా రూపొందించిన పాటలతో సినిమాలో ఈ పాట మాత్రం ప్రత్యేకంగా నిలుస్తుంది. జనవరి 2025 మొదటి వారంలో, అద్భుతమైన బీట్స్‌తో కూడిన మాస్ సాంగ్ విడుదల కానుంది. ఈ పాటను బాలయ్య, ఊర్వశి రౌటేల(Urvashi Rautela)పై చిత్రీకరించారు. జనవరి 12న థియేటర్లలో విడుదల కానున్న డాకు మహారాజ్, దాని ట్రై...
Lucknow bank heist | ల‌క్నోలో బ్యాంక్ దోపిడీ.. పోలీసుల ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు నిందితుల మృతి..
Crime

Lucknow bank heist | ల‌క్నోలో బ్యాంక్ దోపిడీ.. పోలీసుల ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు నిందితుల మృతి..

Lucknow bank heist | లక్నో బ్యాంకు దోపిడీ కేసులో కీల‌క పరిణామం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ పోలీసులు గత 24 గంటల్లో రాష్ట్ర రాజధాని, ఘాజీపూర్‌లో వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు కీలక నిందితులను హతమార్చారు. లక్నోలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB)కి చెందిన 42 లాకర్లను పగులగొట్టి కోట్ల విలువైన నగలు, ఇతర విలువైన వస్తువులను ముఠా సభ్యులు దోచుకెళ్లారు (Bank Loot ). ఈ క్ర‌మంలో పోలీసులు పలుచోట్ల ఎన్‌కౌంట‌ర్లు చేప‌ట్ట‌గా ఇద్ద‌రు హ‌తమ‌య్యారు. Lucknow Encounter : లక్నోలోని చిన్‌హట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ పథ్‌లో పోలీసులకు, నిందితులకు మధ్య జరిగిన తొలి ఎన్‌కౌంటర్‌లో నిందితుడు సోబింద్ కుమార్ (29) హతమయ్యాడు. ఎన్‌కౌంటర్ తర్వాత పోలీసులు అతన్ని ఆసుపత్రిలో చేర్చారు, అక్కడ అతను చికిత్స పొందుతూ మరణించాడు. అతనితో పాటు ఉన్న మరో నిందితుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఘాజీపూర్‌లో రెండో ఎన్‌కౌంటర్ ఉత...
Shyam Benegal | సినిమా ఇండస్ట్రీలో విషాదం..  ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్‌ బెనగాల్ కన్నుమూత
Cinema

Shyam Benegal | సినిమా ఇండస్ట్రీలో విషాదం.. ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్‌ బెనగాల్ కన్నుమూత

Shyam Benegal Passed away ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్‌ బెనగాల్ తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 90 ఏళ్ల పడిలో కన్నుమూశారు. ఆయన మరణంతో భారతీయ సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కు గురైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో సహా సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు. భారతీయ సినీ పరిశ్రమకు శ్యామ్‌ చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. శ్యామ్ బెనెగల్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్ర‌మంలో సోమవారం సాయంత్రం ఆరోగ్యం విష‌మించ‌డంతో కన్నుమూశాడు. 1934 డిసెంబర్ 14న హైదరాబాద్‌లోని తిరుమలగిరిలో శ్యామ్ బెనెగల్ జన్మించారు. శ్యామ్ బెనగల్‌ భారతీయ సినీ దర్శకుడిగా.. చిత్ర రచయితగా కీర్తిప్ర‌తిష్ట‌లు పొందారు. Legendary Filmmaker shyam benegal movies చాలా ఏళ్లు టీవీ సీరియల్స్‌లకు దర్శకత్వం వహించిన శ్యామ్‌ బెనగాల్‌.. ఆ త‌ర్వాత‌ సినీమా ఇండ‌స్ట్రీలోకి ప్రవేశించారు. శ్...
New Municipal Corporations | తెలంగాణలో కొత్తగా రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, 12 మునిసిపాలిటీలు..
State

New Municipal Corporations | తెలంగాణలో కొత్తగా రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, 12 మునిసిపాలిటీలు..

New Municipal Corporations in Telangana : పట్టణాభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ వెలువడనుంది.ఇవి అందుబాటులోకి వస్తే.. రాష్ట్ర పట్టణ వ్యవస్థ.. 13 మునిసిపల్ కార్పొరేషన్లు, 141 మునిసిపాలిటీల నుండి విస్తరిస్తుంది.మహబూబ్‌నగర్, మంచిర్యాల నగరాలను మున్సిపల్ కార్పొరేషన్‌లుగా అప్‌గ్రేడ్ చేస్తారు. కొత్త మున్సిపాలిటీలు: కోహీర్, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్ (సంగారెడ్డి జిల్లా); కేసముద్రం (మహబూబాబాద్); స్టేషన్ ఘన్‌పూర్ (జనగామ); మద్దూరు (నారాయణపేట); ఏదులాపురం (ఖమ్మం); అశ్వారావుపేట (భద్రాద్రి కొత్తగూడెం), చేవెళ్ల, మొయినాబాద్(రంగారెడ్డి ) పలు కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో గ్రామాల విలీనం రాష్ట్ర ప్రభుత్వం చ...
error: Content is protected !!