Ravichandran Ashwin | ఇలా చేశారేంటి అశ్విన్..! ప్రధాని మోదీ లేఖ..
PM Modi Letter to Ashwin | న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించిన ఆఫ్ స్పిన్ మాస్ట్రో రవిచంద్రన్ అశ్విన్ ( Ravichandran Ashwin)కు ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. క్రికెట్ ఫీల్డులో “జెర్సీ నం. 99 చాలా మిస్ అవుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
గబ్బా టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్, టీమీండియా(Team India) గొప్ప మ్యాచ్ విన్నర్‌లలో ఒకరిగా చెరగని ముద్ర వేశాడు. అతని చివరి అంతర్జాతీయ ఆట అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన డే-నైట్ టెస్ట్ లో అతను తన 18 ఓవర్లలో 1-53 తీసుకున్నాడు.. అలాగే బ్యాట్‌తో 29 పరుగులు చేశాడు.
కాగా ప్రధాని మోదీ తన లేఖలో అశ్విన్ రిటైర్మెంట్‌ను ఆశ్చర్యకరమైన ట్విస్ట్ అని పేర్కొన్నారు. ఊహించిన ఆఫ్-బ్రేక్‌లకు బదులుగా ఊహించని విధంగా క్యారమ్ బాల్ విసిరారు.. “అంతర్జాతీయ క్రికెట్ న...




