Sarkar Live

Privacy Policy

TGSRTC | ఆర్టీసీ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త‌గా డిస్పెన్సరీలు
State

TGSRTC | ఆర్టీసీ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త‌గా డిస్పెన్సరీలు

TGSRTC |  హైదరాబాద్ : ఆర్టీసీ ఉద్యోగుల‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) గుడ్ న్యూస్ చెప్పింది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు తమ రోగాల చికిత్స కోసం ఇకపై హైదరాబాద్‌లోని తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి రావాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో వీరికోసం ప్ర‌త్యేకంగా డిస్పెన్సరీలను (TGSRTC dispensaries) ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ యోచిస్తోంది. ఇందుకోసం అవసరమైన వైద్య సిబ్బంది, పరికరాలను కూడా కొనుగోలు చేస్తోంది. అయితే, ఈ డిస్పెన్సరీల్లో అత్యవసర వైద్య‌చికిత్స‌లు ఉండ‌వు. అర్టీసీ కార్మికులంద‌రికీ సాధార‌ణ చికిత్సలను ఇందులో అందించనున్నారు. కార్పొరేషన్‌కు చాలా కాలంగా ఈ డిస్పెన్స‌రీల‌ను ఏర్పాటుచేయాల‌ని నిర్ణ‌యించిన‌ప్ప‌టికీ కార్పొరేషన్ వద్ద తగినంత నిధులు లేకపోవడంతో ఆ దిశగా చర్యలు తీసుకోలేదని తెలిసింది. ఇటీవల ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ డిస్‌పెన్సరీల ఏ...
Lagacharla | లగచర్ల గిరిజన రైతుకు సంకేళ్లు వేసి తీసుకొచ్చిన జైలు సిబ్బంది ..
Crime

Lagacharla | లగచర్ల గిరిజన రైతుకు సంకేళ్లు వేసి తీసుకొచ్చిన జైలు సిబ్బంది ..

ఫార్మాసిటీపై ఆందోళ‌న చేప‌ట్టిన గిరిజన రైతులపై కేసు నమోదు చేసిన పోలీసులు మరోసారి వారిని అవ‌మానించేలా దారుణానికి పాల్పడ్డారు. అధికారులపై దాడులకు పాల్పడ్డార‌న్న ఆరోప‌ణ‌ల‌తో లగచర్ల (Lagacharla) కు చెందిన రైతు హీర్యానాయక్‌తో పాటు మరికొందరు రైతులను అరెస్టు చేసి జైలుకు తర‌లించిన విష‌యం తెలిసిందే.. కాగా హీర్యానాయక్‌కు గురువారం గుండె సమస్య త‌లెత్త‌డంతో అతడికి సంకెళ్ళ తోనే (Hand Cuffs) జైలు సిబ్బంది సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లి 2డీ ఈకో టెస్ట్ చేయించారు. సంకెళ్లు వేసి తీసుకురావడం స‌రికాద‌ని గతంలో న్యాయాస్థానాలు హెచ్చ‌రించినా కూడా పోలీసులు ప‌ట్టించుకోకుండా హీర్యానాయక్‌కు సంకెళ్లు వేయడంపై స‌ర్వ‌త్రా ఆగ్రహం వ్యక్త‌మ‌వుతోంది. . కాగా ఆసుపత్రిలో హీర్యా నాయక్ ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పరామర్శించారు. సీఎం రేవంత్ పై కేటీఆర్ ఆగ్ర‌హం ఇదిలా ఉండ‌గా లగచర్ల గిరిజన రైతులకు (Lagachar...
Google Willow | సాంకేతిక ప్రపంచంలో కొత్త శకం.. గూగుల్ విల్లో
Trending

Google Willow | సాంకేతిక ప్రపంచంలో కొత్త శకం.. గూగుల్ విల్లో

Google Willow : గూగుల్ మరో అపూర్వ సాంకేతిక విప్లవానికి నాంది పలికింది. గూగుల్ విల్లో అనే త‌ర్వాతి త‌రం క్వాంటం కంప్యూటింగ్ చిప్‌ను ప్రకటించింది. నేటి అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ చేయగల పనిని ఇది ఐదు నిమిషాల్లో మాత్ర‌మే పూర్తి చేస్తుంద‌ని పేర్కొంది. అదే పనిని సూపర్ కంప్యూటర్‌కు 10 సెప్టిలియన్ సంవత్సరాలు (10,000,000,000,000,000,000,000,000 సంవత్సరాలు) పడుతుంద‌ని తెలిపింది. క్వాంటం ఎరర్ కారెక్షన్‌లో అద్భుత ఫలితాలు గూగుల్ క్వాంటం AI టీమ్ అందించిన అద్భుత ఫలితాల్లో క్వాంటం ఎరర్ కారెక్షన్ కీలకం. దీని ద్వారా క్యూబిట్స్ సంఖ్య పెరిగే కొద్దీ పొరపాట్లు గణనీయంగా తగ్గుతున్నాయని టోక్యో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ ఎమ్మెరిటస్, కోల్‌క‌తాలోని TCG CREST డైరెక్టర్ ప్రొఫెసర్ భాను దాస్ అన్నారు. క్వాంటం ఎరర్ కారెక్షన్‌లో అద్భుతమైన ఫలితాలు ఇస్తుంద‌ని తెలిపారు. Google Willowతో విప్లవాత్మక మార్పులు...
TasteAtlas | హైదరాబాదీ బిర్యానీకి మ‌రింత ఆద‌ర‌ణ‌.. ప్ర‌పంచంలో 31వ ర్యాంకు
Trending

TasteAtlas | హైదరాబాదీ బిర్యానీకి మ‌రింత ఆద‌ర‌ణ‌.. ప్ర‌పంచంలో 31వ ర్యాంకు

TasteAtlas : ప్రపంచంలోని టాప్ 100 వంటకాల జాబితాలో హైద‌రాబాదీ బిర్యానీ చోటు ద‌క్కించుకుంది. 31వ ర్యాంకును సంపాదించుకుంది. దీంతో మ‌రో మూడు భార‌తీయ వంట‌కాలకు కూడా ఈ జాబితాలో చోటు ల‌భించింది. TasteAtlas రూపొందించిన ఈ లిస్టులో హైద‌రాబాదీ బిర్యానీ చేర‌పోవ‌డం, అందులో మంచి ర్యాంకును ద‌క్కించుకోవ‌డంపై స‌ర్వ‌త్రా హర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. అగ్ర‌స్థానంలో మన బిర్యానీ టేస్ట్ అట్లాస్ రూపొందించిన తాజా జాబితాలో నాలుగు ప్రముఖ భారతీయ వంటకాలు ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరును తెచ్చుకున్నాయి. వాటిలో మ‌న హైదరాబాదీ బిర్యానీ అగ్రస్థానంలో ఉండ‌టంతో ఈ డిష్‌కు మ‌రింత విశేష‌ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. TasteAtlas జాబితాలో భారతీయ వంటకాలు ముర్గ్ మఖనీ (ర్యాంక్ 29): దీనిని బటర్ చికెన్ అని కూడా పిలుస్తారు. ఇది ఉత్తర భారత సంప్రదాయ వంటకం. మృదువైన చికెన్ ముక్కలు, క్రీమీ టమాటో గ్రేవీతో రూపొందించే ఈ డిష్‌ అంతర్జాతీయంగా గుర్తింపు పొంద...
Soundale Village | తిట్టు తిట్టుకూ 500.. జ‌రిమానా విధిస్తున్న గ్రామ‌ పంచాయ‌తీ
Trending

Soundale Village | తిట్టు తిట్టుకూ 500.. జ‌రిమానా విధిస్తున్న గ్రామ‌ పంచాయ‌తీ

Soundale village : కొంద‌రికి ఓ దుర‌ల‌వాటు ఉంటుంది. చీటికిమాటికి ఎవరిని ప‌డితే వారిని తిట్టేస్తంటారు. విష‌యం చిన్న‌దైనా నోరు పారేసుకుంటారు. ఏది మాట్లాడినా తిట్లను ఊత ప‌దంలా వాడుతుంటారు. నోరు తెరిస్తే అమ్మ‌నా బూతులే (Foul Language). ఎంతో ఈజీగా ఒక‌రి త‌ల్లిని, సోద‌రిని ఉద్దేశించి దూర్భాష‌లాట‌డమే వీరి ప‌ని. ఎవ‌రి మీదైతే కోపం ఉంటుందో వారినే కాకుండా 'నీ అమ్మ‌....,' 'నీ అక్క‌..' అంటూ వారి కుటుంబ స‌భ్యుల‌ను ఉద్దేశించి కూడా ప‌రుష ప‌ద‌జాలాన్ని వాడుతుంటారు. ఇలాంటి వారు స‌మాజంలో మ‌న చుట్టూ అనేక మందే ఉంటారు. అయితే.. ఎవ‌రెలా ఉన్నా త‌మ ఊరులో మాత్రం ఇలాంటి మ‌న‌స్త‌త్వం గ‌ల మ‌నుషులు ఉండొద్ద‌ని భావించారు మ‌హారాష్ట్రలోని అహ్మ‌ద్‌న‌గ‌ర్ జిల్లా సౌందాలకు చెందిన ప‌లువురు గ్రామ‌స్థులు. అక్క‌డి జ‌నంలో మార్పును తీసుకురావడానికి ఓ వినూత్న కార్యాచ‌ర‌ణ‌కు పూనుకున్నారు. ఒక‌రి త‌ల్లిని, సోద‌రిని ఉద్దేశించి ఎవ‌రైనా తిడితే...
error: Content is protected !!