Paddy Procurement | రైతులకు కోత.. అధికారులకు మేత…
తరుగు పేరుతో రైతుల ధాన్యాన్ని దోచుకుంటున్న కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు
బస్తాకు 2 నుంచి 5 కిలోల వరకు కోతపెడుతున్నట్లు సమాచారం
మామూళ్ల అలవాటు పడి చూసిచూడనట్లగా కొందరు అధికారులు!
తరుగు పేరుతో తీసిన ధాన్యం ఎవరి ఖాతాలోకి వెళుతోంది?
ఆ డబ్బులు ఎవరు మింగుతున్నారు?
Paddy Procurement | రైతులు ఆరుగాలం పండించిన ధాన్యాన్ని తరుగు పేరుతో బస్తాకు 2 నుంచి 5 కిలోల వరకు కోత పెడుతున్నట్లు తెలుస్తోంది. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మిల్లర్లతో కుమ్మక్కై దోచుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. రైతులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన అధికారులే మిల్లర్లు ఇచ్చే మామూళ్లకు (మేతకు) అలవాటు పడి చూసీచూడనట్ల వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొంతమంది పౌరసరఫరాల శాఖ అధికారుల మూలంగా మసకబార...




