Sarkar Live

Privacy Policy

Delhi | ఢిల్లీలో భారీ పేలుడు.. భయాందోళనలో స్థానికులు
Crime

Delhi | ఢిల్లీలో భారీ పేలుడు.. భయాందోళనలో స్థానికులు

Delhi | దేశ రాజధాని న్యూఢిల్లీ (Delhi)లో గురువారం ఉద‌యం ఒక్కసారిగా భారీ పేలుడు (Explosion) సంభవించింది. ప్రశాంత్‌ విహార్‌ (Prashant Vihar) ప్రాంతంలోని పీవీఆర్‌ (PVR) మల్టీప్లెక్స్‌ సమీపంలో గల ఓ స్వీట్‌ షాప్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడు ధాటికి స‌మీప ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గురువారం ఉదయం 11:48 గంటల ప్రాంతంలో స్వీట్‌ షాప్‌ వద్ద పేలుడు సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. దీంతో వెంట‌నే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకున్నారు. ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్ట‌గా తెల్లటి పొడి వంటి పదార్థం ల‌భ్య‌మైన‌ట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేప‌ట్టారు. Also Read |  Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై కదలిక ఘటనా స్థలంలో పేలుడుకు సంబంధించి వచ్చిన కాల్‌ను ప‌రిశీలిస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు. పే...
KTR | బడిపిల్లలకు బాసటగా నిలిస్తే అరెస్ట్ చేస్తారా ?
State

KTR | బడిపిల్లలకు బాసటగా నిలిస్తే అరెస్ట్ చేస్తారా ?

KTR | హైదరాబాద్‌: ప్ర‌భుత్వ పాఠ‌శాల పిల్లలకు అండ‌గా నిలిచిన భార‌త‌రాష్ట్ర స‌మితి విద్యార్థి విభాగం (బీఆర్‌ఎస్వీ) నాయకులను అరెస్టు చేయ‌డం అప్రజాస్వామికమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) అన్నారు. విద్యార్థి నాయకులకు త‌క్ష‌ణ‌మే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బుధవారం విద్యార్థి నేత‌ల‌ను అరెస్టు చేసి ఇప్పటికీ వారి ఆచూకీ చెప్పకుండా రాత్రంతా తిప్పుతారా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ప్రజాపాలనలో ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ఆయ‌న‌ మండి పడ్డారు. సమస్యలపై నిలదీస్తే నిర్బంధాలా?, బడిపిల్లలకు బాసటగా నిలిస్తే అరెస్ట్ చేస్తారా అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుగుల అన్నం పెడుతున్నారని ప్రశ్నిస్తే కేసులు పెడ‌తారా అని విమర్శించారు. గురుకుల సమస్యలపై, విద్యార్థుల ఆత్మహత్యలు, పిల్లల మరణాల గురించి నిల‌దీస్తే గొంతు నొక్కుతారా అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. మా బీఆర్ఎస్‌వి నాయకులు ‘గురుకుల బాట’ చే...
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై కదలిక
State

Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై కదలిక

Hyderabad Metro : హైదరాబాద్ నగరమంతా మెట్రో సేవలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రెండో దశ మెట్రో ప్రాజెక్ట్ లో భాగంగా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అండర్ గ్రౌండ్ మార్గంలో మెట్రోలో ప్రయాణించే సదుపాయం నగరవాసులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు దిల్లీకి పరిమితమైన ఈ సౌకర్యం హైదరాబాద్ కూ రానుంది. హైదరాబాద్ లో పెరిగిన రద్దీ కారణం కాగా రవాణా వ్యవస్థలో మెట్రో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో రెండో దశ మెట్రో ప్రాజెక్ట్ పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే మూడు కారిడార్ల ద్వారా నగరవాసులకు మెట్రో సేవలు అందుతుండగా, మరో 5 కారిడార్లు రానున్నాయని చెప్పవచ్చు. ఈ 5 కారిడార్ల నిర్మాణానికి 116.4 కిలోమీటర్లు మెట్రో రవాణా సాగుతుండగా, అండర్ గ్రౌండ్ మార్గం కూడా ఇందులో చేరనుంది. ఇది మియాపూర్ నుంమ్ర్ పటాన్ చెరువు వరకు డబుల్ డెక్కర్, నాగోలు నుంమ్ర్ ఎయిర్ పోర్ట్ వ...
Food Poisoning | స్కూళ్ల‌లో ఫుడ్‌పాయిజ‌న్ ఘ‌ట‌న‌పై హైకోర్టు సీరియ‌స్‌
Crime

Food Poisoning | స్కూళ్ల‌లో ఫుడ్‌పాయిజ‌న్ ఘ‌ట‌న‌పై హైకోర్టు సీరియ‌స్‌

Food Poisoning | హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్‌ పాయిజనింగ్‌ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురి అయిన ఘ‌ట‌న‌పై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. వెంట‌నే ఆయా పాఠశాలల నుంచి మధ్యాహ్న భోజనం నమూనాలను ల్యాబ్‌ల కు పంపించాల‌ని ఆదేశించింది. నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్‌ పాయిజనింగ్‌పై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)పై కోర్టు తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీసిన హైకోర్టు.. ఫుడ్ పాయిజన్ వల్ల పిల్లలు చనిపోతే మాత్రం స్పందించరా అని ప్రశ్నించింది. అధికారుల‌కు కూడా పిల్లలు ఉన్నారని.. మానవతా దృక్పథాన్ని అలవర్చుకోవాలని అధికారులకు త‌లంటింది. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడంపై కోర్టు ప్రభుత్వాన్ని కూడా నిలదీసింది. ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుని వొచ్చే సోమవారంలోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారం రోజుల వ్యవధిలో ఇదే పాఠశ...
Sridhar Babu | మంథ‌ని – మంచిర్యాల మ‌ధ్య 120కోట్ల‌తో బ్రిడ్జి
State

Sridhar Babu | మంథ‌ని – మంచిర్యాల మ‌ధ్య 120కోట్ల‌తో బ్రిడ్జి

Telangana | వాణిజ్య వ్యాపారాలు విస్తరించేందుకు మంథని మంచిర్యాల ప‌ట్ట‌ణాల‌ను కలుపుతూ గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.120 కోట్లు మంజూరు చేశామని ఐటి, పరిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు (Sridhar Babu) వెల్ల‌డించారు. బ్రిడ్జి నిర్మాణ ప‌నుల‌కు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని తెలిపారు. మంథని పట్టణంలో యువకులకు ఉపాధి కల్పించేందుకు చిన్న సాఫ్ట్ వేర్‌ కంపెనీ ప్రారంభించామని, భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు తీసుకువస్తామ‌ని తెలిపారు. అలాగే మంథ‌ని స‌మీపంలోని రామగిరి క్షేత్రాన్ని రూ.5 కోట్లతో అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీధ‌ర్‌బాబు హామీ ఇచ్చారు. మంథని సమీపంలో గోదావరి నది పుష్కరాలు నిర్వహణకు రూ. 2 కోట్లతో అభివృద్ధి ప‌నులు చేప‌ట్టనున్న‌ట్లు తెలిపారు. మంథని పట్టణ సమీపంలో 150 మంది మహిళ సంఘాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతూ చిన్న ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి అవసరమైన...
error: Content is protected !!