Sarkar Live

Privacy Policy

Indian Railways | భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు నుంచి ప్రత్యేక యాత్రలు
LifeStyle

Indian Railways | భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు నుంచి ప్రత్యేక యాత్రలు

Indian Railways Bharat Gaurav Train | విశాఖపట్నం: భారతీయ రైల్వే ఆధ్వర్యంలో నిర్వ‌హిస్తున్న‌ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు (Bharat Gaurav Tourist Train) ఈ సంవత్సరం రెండు ప్రత్యేక ఆధ్యాత్మిక సర్క్యూట్‌లను ప్రకటించింది. టూర్ టైమ్స్ నిర్వహిస్తున్న సౌత్ స్టార్ రైల్ ద్వారా భక్తులు భారత్‌లోని పవిత్రమైన ఆధ్యాత్మిక‌ ప్రదేశాలను దర్శించుకునే అరుదైన అవకాశం క‌ల్పిస్తోంది. మొదటి యాత్రా సర్క్యూట్ నవంబర్‌ 16న ప్రారంభమై 11 రోజులపాటు తమిళనాడు, కేరళలోని ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తుంది. ఇందులో ప్రదోషం రోజున నటరాజ స్వామి, మాసిక్ శివరాత్రి రోజున అరుణాచలేశ్వర స్వామి దర్శనం ప్ర‌త్యేకంగా చెప్పుకోవ‌చ్చు..టికెట్ ధరలు రూ. 19,950 (2SL) నుంచి రూ. 42,950 (1AC) వరకు ఉన్నాయి. రెండో యాత్ర నవంబర్‌ 26న ప్రారంభమవుతుంది. ఇది 10 రోజుల పాటు సాగి పంచ ద్వారక యాత్రను కవర్ చేస్తుంది. ఇందులో నిష్కలంక్ మహాదేవ్ సముద్ర ఆలయం, జ్యోతిర...
BC Reservations : బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
Hyderabad, State

BC Reservations : బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

హైదరాబాద్‌: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అంశంపై సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి ఉపశమనం కల్పించింది. బీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్‌నాథ్‌, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఈ కేసు హైకోర్టులో ఇప్పటికే విచారణలో ఉందని, అదే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల శాతం పెంపుపై పిటిష‌న‌ర్‌ వంగా గోపాల్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ సందర్భంగా, “హైకోర్టులో కేసు కొనసాగుతుండగా ఇక్కడకు ఎందుకు వచ్చారు?” అని ధర్మాసనం పిటిషనర్‌ తరఫు లాయర్‌ను ప్రశ్నించింది. దీనికి ప్రతిగా ఆయన “హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది” అని సమాధానమిచ్చారు. ఆపై ధర్మాసనం, “అక్కడ స్టే నిరాకరించి...
Harish Rao | “రేవంత్ రెడ్డి ప్రభుత్వం పన్ను విధించుడు తప్ప కొత్తదేమీ లేదు”
State, Nizamabad

Harish Rao | “రేవంత్ రెడ్డి ప్రభుత్వం పన్ను విధించుడు తప్ప కొత్తదేమీ లేదు”

Nizamabad | రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వానికి ప‌న్నులు విధించుడు త‌ప్ప‌న ఇంకేమీ లేద‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు (Harish Rao) విమ‌ర్శించారు.ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు సమక్షంలో బీజేపీ నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చాక‌ మళ్లీ భూముల ధరలు పడిపోయాయని తెలిపారు. బీర్ల ధరలు, విస్కీ ధరలు పెంచించార‌ని తెలిపారు. మ‌హిళ‌ల‌కు ఫ్రీ బస్సు ఇచ్చి మొగోళ్లకు డబల్ టికెట్ కొడుతున్నారని తెలిపారు. కేసీఆర్ తెచ్చిన పథకాలను బంద్ చేశాడు.నూట్రిషన్ కిట్టు బందు.. కేసీఆర్ కిట్టు బందు.. బతుకమ్మ చీరలు బంద్ అయ్యాయ‌ని మండిప‌డ్డారు. కేసీఆర్ ఉండంగా ఎట్ల ఇచ్చిండు.. రేవంత్ రెడ్డి ఎందుకు బంద్ చేసిండు అని ప్రశ్నించారు. రేవంత...
Mohan Babu | కలెక్షన్ కింగ్ మళ్లీ బిజీ కానున్నాడా..?
Cinema

Mohan Babu | కలెక్షన్ కింగ్ మళ్లీ బిజీ కానున్నాడా..?

ఒకప్పుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) రూటే సపరేటు. విలన్ గా చాలా మంది వచ్చినా మోహన్ బాబు తనదైన డైలాగ్ డెలివరీతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్, ఏ ఎన్ఆర్, చిరంజీవి లాంటి పెద్ద హీరోల సినిమాల లో కూడా విలన్ గా పోటా పోటీగా మెప్పించాడు. నెగిటివ్ రోల్ లో క్రూరంగా యాక్ట్ చేసి అదరగొట్టారు. ఆ తర్వాత హీరోగా మారి కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు.ప్రొడ్యూసర్ గా మారి సూపర్ హిట్స్ అందించాడు. రెండున్నర దశాబ్దాల క్రితం మోహన్ బాబు రేంజ్ వేరు. ఆయన నుండి మూవీ వస్తుందంటే ఆడియన్స్ ఈగర్లీ వెయిట్ చేసేవారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీసిన బుజ్జిగాడు లో కూడా పవర్ ఫుల్ గా యాక్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా ఆయన రేంజ్ కు తగ్గట్టుగా ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు. పవర్ ఫుల్ మూవీతో కంబ్యాక్.. చాలా కాలం తర్వాత ఒక పవర్ ఫుల్ మూవీ తో కంబ్యాక్ ఇస్తున్నారు. నాచురల్ స్టార్ నాని(natural...
South Central Railway | ద‌క్షిణ మ‌ధ్య రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం
Hyderabad

South Central Railway | ద‌క్షిణ మ‌ధ్య రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం

Hyderabad | దక్షిణ మధ్య రైల్వే (SCR- South Central Railway) ఈ ఏడాది ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య కాలంలో సరుకు రవాణా, ప్రయాణీకుల రైళ్ల‌ విభాగాలలో అత్యుత్తమ పనితీరును నమోదు చేసింది. గత సంవత్సరం అత్యధికంగా రూ.9,966 కోట్ల స్థూల ఆదాయాన్ని అధిగమించి రూ.10,143 కోట్ల స్థూల ఆదాయాన్ని ఆర్జించింది. SCR అధికారుల ప్రకారం, ఈ జోన్ 71.14 మిలియన్ టన్నుల (MTs) ఆల్ టైమ్ హై సరకు రవాణాను సాధించింది. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో 67 MTల నుంచి 6 శాతం పెరిగి, ఆదాయానికి రూ.6,635 కోట్లను అందించింది. ఇనుప ఖనిజం, ఉక్కు కర్మాగారాలకు ముడి పదార్థాలు, సిమెంట్ రవాణా పెరగడం వల్ల ఈ పెరుగుదల ప్రధానంగా జరిగిందని SCR జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. కాగా ప్రయాణీకుల ఆదాయం కూడా ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే వృద్ధిని నమోదు చేసుకుని రూ.2,991 కోట్లకు చేరుకుంది. ఇది 2024-25లో రూ.2,909 కోట్ల నుంచి 2.8 శాతం పెరిగింది. . వందే భారత...
error: Content is protected !!