Sarkar Live

Privacy Policy

State, Hyderabad

స్థానిక ఎన్నికల షెడ్యూల్ పూర్తి వివ‌రాలు ఇవే.. ఎలక్షన్స్ – Local Body Elections

Local Body Elections : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు (Telangana Gram Panchayat Elections 2025) అంతా సిద్ధ‌మైంది. అక్టోబర్‌ 9 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. మొద‌ట ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్‌ ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం ఐదు దశల్లో విడుతల్లో పోలింగ్ ను నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో, సర్పంచ్‌ ఎన్నికలను మూడు దశల్లో జరిపించ‌నున్నారు.ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్‌ను సోమ‌వారం ప్రకటించారు. అక్టోబర్‌ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడుత పోలింగ్‌, అదే నెల 27న రెండో విడుత పోలింగ్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. అక్టోబర్‌ 17న సర్పంచ్‌ ఎన్నికలకు తొలి విడుత నోటిఫికేషన్‌ విడుదల చేయ‌నున్నారు. అక్టోబర్‌ 31న సర్పంచ్‌ ఎన్నికల తొలి విడుత పోలింగ...
హైద‌రాబాద్-విజ‌య‌వాడ 8లైన్ల ర‌హ‌దారిపై కీల‌క అప్‌డేట్‌ – Hyderabad Vijayawada expressway
State, AndhraPradesh

హైద‌రాబాద్-విజ‌య‌వాడ 8లైన్ల ర‌హ‌దారిపై కీల‌క అప్‌డేట్‌ – Hyderabad Vijayawada expressway

Hyderabad Vijayawada expressway | హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణం ఇక మరింత సులభం కానుంది. జాతీయ రహదారి (NH65)ని 8 లేన్‌లుగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధ‌మైంది. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తికాగా, ఈ భారీ ప్రాజెక్ట్ పనులు 2026 ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానున్నాయని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈరోజు ప్రకటించారు. ప్రతి రోజు భారీ ట్రాఫిక్‌తో ఇబ్బందులు ప‌డుతున్న ఇరురాష్ట్రాల ప్ర‌యాణికుల‌కు ఇది భారీ ఊర‌ట ల‌భించ‌నుంది. ఈ రహదారిపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో 17 బ్లాక్‌స్పాట్‌లను గుర్తించి ఫ్లైఓవర్లు కూడా నిర్మించ‌నున్న‌ట్లు మంత్రి కోమ‌టిరెడ్డి వెల్లడించారు. ఇటీవల దిల్లీలో కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన భేటీలో ఈ అంశాన్ని ప్రస్తావించానని మంత్రి తెలిపారు. కేవలం రెండు గంటల్లో హైదరాబాద్ నుండి విజయవాడకుకొత్త రహదారి పూర్తయిన తర్...
తమిళనాడు కరూర్‌లో విషాదం.. 39కి చేరిన మృతుల సంఖ్య‌ – Tamil Nadu Karur stampede
National

తమిళనాడు కరూర్‌లో విషాదం.. 39కి చేరిన మృతుల సంఖ్య‌ – Tamil Nadu Karur stampede

Tamil Nadu Karur stampede : శ‌నినివారం (సెప్టెంబర్ 27) తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, నటుడు విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 39కి చేరింది. చెన్నై నుండి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరూర్‌లోని వేదిక వద్ద మధ్యాహ్నం నుండి భారీ సంఖ్యలో గుమిగూడిన ప్ర‌జ‌లను ఉద్దేశించి విజయ్ ప్రసంగిస్తుండగా, రాత్రి 7.30 గంటల ప్రాంతంలో తొక్కిసలాట జరిగిందని అధికారులు తెలిపారు. టీవీకే నాయకుడు, స్టార్ హీరో జోసెఫ్‌ విజ‌య్ చూడటానికి వారు గంటల తరబడి వేచి ఉన్నారు. తన ప్రచార వాహనంపై నుంచి ప్రసంగిస్తున్న విజయ్, ప్రజలు మూర్ఛపోతున్నారని, పడిపోతున్నారని గమనించి చాలా మంది కార్మికులు కేక‌లు వేయ‌డంతో తన ప్రసంగాన్ని మధ్యలో ఆపేశారు. ఇంతలో, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరిస్థితిని సమీక్షించడానికి సచివాలయంలో రాష్ట్ర ఉన్నతాధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి వి...
రాష్ట్రంలో మ‌రో మూడు రోజులు ముంచెత్త‌నున్న వ‌ర్షాలు – Hyderabad floods 2025
Hyderabad

రాష్ట్రంలో మ‌రో మూడు రోజులు ముంచెత్త‌నున్న వ‌ర్షాలు – Hyderabad floods 2025

Hyderabad floods 2025 : కొద్దిరోజులుగా భారీ వ‌ర్షాలు,వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మ‌వుతున్న‌ తెలంగాణ‌కు ఐఎండీ మ‌రోమారు వాతావ‌ర‌ణ‌ హెచ్చ‌రిక‌ జారీ చేసింది. రాష్ట్రంలో మరో మూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అక్టోబర్‌ ఒకటి నాటికి ఉత్తర, దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, జనగాం, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు ప...
Telangana | ఇక సర్కారు చేతుల్లోకి సెల్‌ఫోన్ సీక్రెట్స్‌
Technology

Telangana | ఇక సర్కారు చేతుల్లోకి సెల్‌ఫోన్ సీక్రెట్స్‌

Israeli Hacking software : తెలంగాణ ప్రభుత్వం (Telangana Governament) తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం పెద్ద చర్చకు దారి తీసింది. సైబర్ నేరాల దర్యాప్తుల‌ను వేగ‌వంతం చేయల‌నే ఉద్దేశంతో ఇజ్రాయెలీ కంపెనీ వ‌ద్ద ఓ సాఫ్ట్‌వేర్ కొనుగోలుకు స‌ర్కారు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సాఫ్ట్‌వేర్ మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటి పరికరాల్లోకి చొర‌బ‌డి హ్యాక్ చేయగలదు. త‌ద్వారా నేరాల‌కు సంబంధించి పోలీసులు (police department) ఆధారాల‌ను త్వ‌రిత‌గ‌తిన తెలుసుకునేందుకు సుల‌భ‌త‌రం అవుతుంది. అయితే.. ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ముఖ్యంగా రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇది క‌ల‌క‌లం రేపుతోంది. ఇది నేరాలు జ‌రిగిన‌ప్పుడే మాత్ర‌మే ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉప‌యోగిస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతున్నాదీనిని దుర్వినియోగం చేసే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని విప‌క్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఓటర్ డేటా దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వ‌స్...
error: Content is protected !!