IAS transfers | సీనియర్ ఐఏఎస్ అధికారులకు స్థానచలనం
IAS transfers : తెలంగాణ (Telangana) ప్రభుత్వంలో ముఖ్యమైన పరిపాలనా విభాగాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం (State Government) స్థానచలనం కల్పించింది. ముఖ్యంగా సిరిసిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝా హైకోర్టు (High Court) ఆదేశాలను పక్కనపెట్టిన కారణంగా తీవ్ర విమర్శలకు గురై ప్రస్తుత బాధ్యతను కోల్పోయారు. ఆయన్ను ట్రాన్స్‌పోర్టు, రోడ్ అండ్ బిల్డింగ్ శాఖ (Transport, Roads and Building department)కు ప్రభుత్వం బదిలీ చేసింది. ఇదే క్రమంలో అనేకమంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు కూడా స్థానచలనం కల్పించిన సర్కారు కొత్త బాధ్యతలను అప్పగించింది. ఈమేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారని…
సందీప్ కుమార్ ఝా (Sandeep Kumar Jha) సిరిసిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన...




