Sarkar Live

Privacy Policy

Telangana Rains | రాష్ట్రంపై విరుచుకుపడుతున్న వర్షాలు – ములుగులో రికార్డు వర్షపాతం
State

Telangana Rains | రాష్ట్రంపై విరుచుకుపడుతున్న వర్షాలు – ములుగులో రికార్డు వర్షపాతం

Telangana Rains | తెలంగాణ రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కొన్నిచోట్ల ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పంటలు నీట మునిగిపోయి రైతులు విలవిలలాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదవుతోంది. ములుగును ముంచెత్తుతున్న ముసురు ములుగు జిల్లా మంగపేటలో అత్యధికంగా 18.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఏటూరునాగారం 16.1 సెం.మీ., వెంకటాపురం 12.1 సెం.మీ., జైనథ్‌ (ఆదిలాబాద్‌)లో 11.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మల్లూరు (ములుగు)లో 11.6 సెం.మీ., వాంకిడి (ఆసిఫాబాద్‌)లో 11.3 సెం.మీ., సాత్నాల (ఆదిలాబాద్‌)లో 11 సెం.మీ. వర్షం కురిసింది. తాడ్వాయి, కన్నాయిగూడెం, ధర్మవరం, మేడారం, సిరికొండ, రాంనగర్...
Electric Shock | వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్‌ షాక్‌..
Hyderabad, State

Electric Shock | వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్‌ షాక్‌..

ఇద్దరు యువకులు దుర్మరణం Hyderabad News | హైదరాబాద్‌ రామంతాపూర్‌లో (Ramanthapur) శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఐదుగురు మృతిచెందిన‌ విషాదక‌ర ఘ‌ట‌న మరువకముందే బండ్లగూడలో (Bandlaguda) ఇదే త‌ర‌హా మరో ఘటన చోటుచేసుకుంది. వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా క‌రెంట్ షాక్‌తో (Electric Shock) ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు యువకులు భారీ వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండ‌గా బండ్లగూడ వద్ద గ‌ణేష్‌ విగ్రహానికి హై టెన్షన్‌ వైరు తరగలడంతో ట్రాక్టర్‌కు విద్యుత్ ప్ర‌సార‌మైంది. దీంతో ఇద్దరు యువకులకు షాక్ త‌గిలి అక్కడికక్కడే మరణించారు. ఈ ఘ‌ట‌న‌లో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్క‌డికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిని అఖిల్‌ అనే యువకుడిని హాస్పిట‌ల్ కు తరలించారు. మృతులను టోని (21), వికాస్‌ (20)గా గుర్తించారు. కరెంటు షాక్‌తో ట్రాక్టర్‌ టైర్లు పూర్తిగా ద...
Floods :  వరదల్లో కారుతో సహా కొట్టుకుపోయిన ఫ్యామిలీ
National

Floods : వరదల్లో కారుతో సహా కొట్టుకుపోయిన ఫ్యామిలీ

మహారాష్ట్రలోని ఉద్గిర్ సమీపంలో వరద (Floods) ల్లో తెలంగాణకు చెందిన ఫ్యామిలీ గల్లంతయింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కారుతో సహా వరద నీటిలో కొట్టుకుపోవడం కలకలం రేపింది. మేం వరదల్లో కొట్టుకుపోతున్నాం, పిల్లలూ జాగ్రత్త అంటూ చివరి ఫోన్ కాల్ వచ్చిందని.. ఆ తర్వాత స్విచ్ఛాప్ వచ్చిందని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నలుగురు ఆచూకీ వెంటనే గుర్తించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్ కు చెందిన ఐదుగురితో పాటు మహారాష్ట్రకు చెందిన కారు డ్రైవర్ వాహనాన్ని నడుపుతుండగా ఆగస్ట్ 17న అర్ధరాత్రి మహారాష్ట్రలోని వరద నీటిలో కొట్టుకుపోయింది. మహారాష్ట్రలోని ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఉద్గిర్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాగా, గల్లంతైన వారిలో అఫ్రీనా, హసీనా, సమీనా, ఆఫ్రీన్, సోహెబ్ అనే యువకుడు, మహారాష్ట్ర కు చెందిన కారు డ్రైవ...
Hyderabad | కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర‌ విషాదం: రథానికి కరెంటు తీగలు తగిలి ఐదుగురు మృతి
Crime

Hyderabad | కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర‌ విషాదం: రథానికి కరెంటు తీగలు తగిలి ఐదుగురు మృతి

Hyderabad News | కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర‌ విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ రామంతాపూర్‌లో (Ramanthapur) అర్ధరాత్రి శ్రీకృష్ణాష్టమి (Sri Krishnashtami ) వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్‌ తీగలు (Electric Shock) తగిలి ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివ‌రాల్లోకి వెళితే.. కృష్ణాష్టమి సందర్భంగా రామంతాపూర్‌లోని గోకులేనగర్‌లో ఆదివారం రాత్రి ఊరేగింపు నిర్వహించారు. ఈ క్రమంలో రథాన్ని లాగుతున్న వాహనం ఒక్క‌సారిగా ఆగిపోయింది. దీంతో యువ‌కులు వాహ‌నాన్ని నిలిపివేసి చేతులతో లాగుతూ ముందుకు క‌దిలించారు. ఈ క్ర‌మంలోనే విద్యుత్ తీగలు తగలడంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది మందికి క‌రెంట్‌ షాక్‌ కొట్టింది. దీంతో వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లుగా దూరంగా పడిపోయారు. వీరిలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మ‌ర‌ణం చెందారు. కొంద‌రు సీపీఆర్‌ చేసేందుకు యత్నించినా ప్రాణాలు నిల‌వ‌లేదు. మరో నలుగ...
NTR Devara sequel : దేవర సీక్వెల్ కష్టమేనా..?
Cinema

NTR Devara sequel : దేవర సీక్వెల్ కష్టమేనా..?

NTR Devara sequel : బాహుబలి మూవీ రెండు పార్టులుగా వచ్చి హిట్టు కొట్టిన తర్వాత ఇండస్ట్రీలో సీక్వెల్స్ హవా పెరిగిపోయింది. ఒకప్పుడు బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఉండేది. టాలీవుడ్ లో జక్కన్న ఈ ట్రెండ్ తో భారీ హిట్టు కొట్టి హిస్టరీ క్రియేట్ చేశారు. ఒక స్టోరీ పరిధిని పెంచి కలెక్షన్స్ రాబట్టి పెట్టుబడికి పదింతలు భారీ వసూళ్లు రాబట్టవచ్చని బాహుబలితో నిరూపించాడు. ఆ బాటలోనే కొన్ని మూవీస్ వచ్చినా అనుకున్నంత రేంజ్ లో మాత్రం ఆడలేదు. ఎన్టీఆర్ మేనియాతోనే దేవర హిట్టు… కొరటాల శివ (koratala shiva)డైరెక్షన్ లో వచ్చిన దేవర(Devara) హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చినా అనుకున్నంత స్థాయిలో హిట్టు కొట్టలేదు. మూవీ ఎన్టీఆర్(ntr) మేనియాతోనే ఆడిందని చెప్పొచ్చు. అయితే మూవీ ఎండ్ లో సీక్వెల్ ఉంటుందని కూడా హింట్ ఇచ్చారు. మూవీ బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఇప్పటికే దానికి సంబంధించిన పనులు షురూ అయ్యేవి. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను చాలా డిజప...
error: Content is protected !!