Relief for Multiplexes : మల్టీప్లెక్స్ థియేటర్ల యజమానులకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఊరటనిచ్చింది. 16 ఏళ్ల లోపు పిల్లలు రాత్రి 11 గంటల తర్వాత సినిమాలకు హాజరు కావద్దనే ఆంక్షలను తాత్కాలిక (temporary relief ) నిలిపివేసింది. ఆంక్షలు విధించే ముందు అన్నివర్గాల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. థియేటర్ యజమానులు, పిల్లల తల్లిదండ్రులు, బాల సంరక్ష సంస్థలు, వైద్య నిపుణులను సంప్రదించి మార్గదర్శకాలను రూపొందించి తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు ఈ ఆంక్షలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు న్యాయస్థానం తెలిపింది.
Multiplexes : యజమానుల ఆందోళన
రాత్రి 11 గంటల తర్వాత 16 ఏ ళ్ల పిల్లలు సినిమాలకు రావద్దనే ఆంక్షలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని మల్టీప్లెక్సుల యజమానులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా రాత్రి షోలే పెద్ద మొత్తంలో తమకు ఆదాయం సమకూరుస్తాయని, మినీ షోస్, స్పెషల్ స్క్రీనింగ్‌ల ద్వారా ఎక్కువ లాభాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ ఆంక్షల కారణంగా తమ వ్యాపారంపై తీవ్రంగా ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వాదనలు విన్న హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ఆంక్షలు విధించే ముందు థియేటర్ యజమానులు, బాల సంరక్షణ సంస్థలు, వైద్య నిపుణులు, పిల్లల తల్లిదండ్రులను సంప్రదించాల్సి ఉందని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఆంక్షలు పెట్టడం సరికాదని పేర్కొంది.
ఆంక్షలు విధించడానికి కారణం ఏమిటి?
ఇటీవల ‘పుష్ప 2’ ప్రీమియర్ షో (Puspha 2 premiere) సందర్భంగా జరిగిన దుర్ఘటనే ఈ ఆంక్షలు విధించడానికి కారణమైంది. ఈ ప్రీమియర్ స్క్రీనింగ్ సందర్భంగా భారీ సంఖ్యలో అభిమానులు థియేటర్లకు తరలివచ్చారు. ఆ హడావుడిలో తొక్కిసలాట ఏర్పడి, ఒక మహిళ మరణించింది. ఆమె కొడుకు ఆస్పత్రిలో చేరాడు. ఈ ఘటన కారణంగా ప్రభుత్వం ప్రత్యేక షోలకు కొన్ని ఆంక్షలు విధించింది. ఉదయం 11 గంటల ముందు, రాత్రి 11 గంటల తర్వాత 16 ఏళ్ల లోపు పిల్లలు థియేటర్లకు రావద్దని నిషేధాన్ని అమల్లోకి తెచ్చింది.
Relief for Multiplexes : హైకోర్టు జోక్యం
ఈ ఆంక్షలను విభేదించిన మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైకోర్టును ఆశ్రయించింది. సినిమా చూసే హక్కును పరిమితం చేయడం తగదని, పిల్లలు తమ తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే సినిమాలకు వస్తారని, అందువల్ల ప్రభుత్వ ఆదేశాలు పునస్సమీక్షించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. దీంతో న్యాయ స్థానం ఈ ఆంక్షలను తాత్కాలికంగా నిలిపివేసింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..