Scarlet fever : సీజనల్ వ్యాధులు తెలంగాణ ప్రజలకు కొత్తేమీ కాదు. ఏ కాలమైనా ఏదో ఒక రుగ్మతతో బాధపడటం ఇక్కడ పరిపాటి. ప్రస్తుతం శీతాకాలంలోనూ అలాంటివే చవిచూడాల్సి వస్తోంది. ముఖ్యంగా ఈ వింటర్‌లోనూ వైరల్ ఫీవర్స్ ప్రబలుతున్నాయి. ముఖ్యంగా ఓ విషజ్వరం హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో వ్యాపిస్తోంది.
Scarlet fever ఏమిటంటే..
ప్రస్తుత శీతాకాలంలో ఇతర వైరల్ జ్వరాలతో పాటు స్కార్లెట్ ఫీవర్ కేసులు తెలంగాణలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇవి ఎక్కువ నమోదవుతున్నాయి. 5 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు దీని బారిన పడుతున్నారని వైద్య నిపుణులు కనుగొన్నారు. ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ (Bacterial Infection) వల్ల ఈ స్కార్లెట్ ఫీవర్ సంభవిస్తుంది.
స్కార్లెట్ ఫీవర్ లక్షణాలు
కొన్ని రోజులుగా పిల్లల్లో స్కార్లెట్ ఫీవర్ (Scarlet fever) కేసులు నమోదవుతున్నాయని అంటున్నారు హైదరాబాద్‌లోని పిడియాట్రిషియన్లు. పిల్లలు జ్వరం బారిన పడి గొంతు నొప్పితో కూడిన ఎర్రని టాన్సిల్స్ (కొన్నిసార్లు టాన్సిల్స్‌పై తెల్లని పూత కూడా కనిపించొచ్చు) గానీ, నాలుక స్ట్రాబెర్రీ రంగులో మారడం గానీ, శరీరంపై దద్దుర్లు లాంటి లక్షణాలు గానీ కనిపిస్తే వెంటనే పిడియాట్రిషియన్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.
ఆలస్యం చేయొద్దు..
స్కార్లెట్ ఫీవర్ కేసులు హైదరాబాద్‌లో పిల్లల్లో పెరుగుతున్నాయి. జ్వరం, గొంతు నొప్పి, నాలుక ఎర్ర బారడం, శీరరంపై దద్దుర్లు రావడం దీని లక్షణాలు. ఇవి కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా చికిత్స తీసుకోవాలని అంటున్నారు పిడియాట్రిషియన్లు (Pediatrician). పిల్లలకు జ్వరం ఉంటే వెంటనే డాక్టర్‌ను చూపించాలని సూచిస్తున్నారు. ఆలస్యం చేయకుండా యాంటీబయాటిక్స్ తీసుకోవడం చాలా ముఖ్యమని అంటున్నారు.
యాంటీబయాటిక్స్ ద్వారా చికిత్స
స్కార్లెట్ ఫీవర్ అనేది గ్రూప్ -ఏ స్ట్రెప్టోకాకస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దీనికి నిర్దిష్ట యాంటీబయాటిక్స్ ద్వారా చికిత్స చేయొచ్చు. పిల్లలు ఈ బ్యాక్టీరియాకు గురైన తర్వాత
సాధారణంగా 2 నుంచి 5 రోజుల లోపు లక్షణాలు కనిపిస్తాయి.
స్కార్లెట్ ఫీవర్ ఎలా వ్యాపిస్తుందంటే…
స్కార్లెట్ ఫీవర్ బారిన పడిన వ్యక్తి తుమ్ము లేదా దగ్గు వచ్చినప్పుడు ఇతరులకు ఇది వ్యాపిస్తుంది. ఆహారం, నీరు పంచుకోవడం, శరీరంలోని స్రావాలను తాకి ఆ మార్గం ద్వారా ముక్కు, నోటికి చేరడం ద్వారా ఈ బ్యాక్టీరియా ఒకరి నుంచి ఒకరికి చేరుతుంది.
స్కార్లెట్ ఫీవర్.. జాగ్రత్తలు
- స్కార్లెట్ ఫీవర్ బారిన పడిన పిల్లలను కనీసం 24 గంటల పాటు జ్వరం పూర్తిగా తగ్గే వరకు పాఠశాలకు పంపొద్దు.
- వైద్యులు సూచించిన వ్యవధిలో సరైన యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. తద్వారా ఈ ఇన్ఫెక్షన్‌ను తగ్గించొచ్చు.
- స్కార్లెట్ ఫీవర్ బారిన పడగానే వెంటనే డాక్టర్‌కు చూపించాలి. చికిత్సను ఆలస్యం చేయొద్దు.
- చికిత్స ఆలస్యం చేయడం వల్ల గుండె, మూత్రపిండాలపై ప్రభావం పడొచ్చు. బిడ్డ ఆరోగ్య పరిస్థితి మరింత తీవ్రతరం కావచ్చు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..